చిత్రం చెప్పే విశేషాలు
(27-02-2025)
అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమ్లే జిల్లా బోసిమ్లాలో బుధవారం నిర్వహించిన గిరిజనుల సంప్రదాయ వేడుకల్లో నృత్యం చేస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. లక్షల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. విద్యుత్తు దీపాలతో ఆలయం వెలుగులీనింది.
గుడ్లూరు: దూరం నుంచి చూస్తే ఏదో పెద్ద కీటకం వస్తున్నట్లు అనిపిస్తుంది. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే పురుగుమందు పిచికారి చేసే యంత్రవాహనం ఇలా కనిపిస్తోంది.
ములుగు: మర్కుక్‌లో దీపాలతో ఏర్పాటు చేసిన శివలింగం
మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల చిత్రలేఖనం ఉపాధ్యాయుడు బాలకిషన్ .. బాదం ఆకుపై గీసిన శంకరుడి చిత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున భక్తులతో నిండిపోయిన ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం.
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ బాలాజీ ఆలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహం వద్ద బుధవారం నాగుపాము భక్తులకు కనిపించింది.
పాల్వంచ గ్రామీణం: కిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో సందర్శకుల చేతిలో ఏ ఆహారం కనిపించినా కోతులు లాక్కుంటున్నాయి.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులు .