#eenadu

 ఈ చిత్రంలో ఉన్నది ఎవరో గుర్తుపడతారా? క్రికెట్‌ అభిమానులైతే ఠక్కున విరాట్‌ కోహ్లి అనేస్తారేమో! ఏదైనా యాడ్‌ షూటింగ్‌లో భాగంగా ఇలా తయారయ్యాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది కోహ్లి కాదు.. 

విద్యార్థులను ఆకర్షించేలా తరగతి గదులను రైలు బోగీల మాదిరిగా ఇలా రంగులతో తీర్చిదిద్దారు. శంషాబాద్‌ మండలం కాచారంలోని ప్రాథమిక పాఠశాలలోనిది ఈ చిత్రం. 

హైదరాబాద్‌ సన్‌రైజర్స్, లఖ్‌నవూ జట్ల మధ్య గురువారం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం సిద్ధమైంది. ఇరుజట్ల ఆటగాళ్లు బుధవారం మైదానంలో సాధన చేస్తూ కనిపించారు. 

 శ్రీకాకుళం నగరం : సంజీవయ్యకాలనీ, డైమండ్, గాంధీ, ఎల్‌బీఎస్‌ పార్కుల్లో ఏర్పాటు చేసిన ఆ వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. 

సీతారామపురం: సాధారణంగా కుక్కలను చూసి దూడలు బెదిరిపోతుంటాయి. కానీ ఈ చిత్రం చూడండీ.. ఇవి రెండూ సావాసంగా ఉండడంతో స్థానికులు సైతం వీటిని ఆసక్తిగా గమనించారు.  

ఎడారి జాతికి చెందిన అరుదైన మొక్కలు పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో కనువిందు చేస్తున్నాయి.  

రుషికొండ బీచ్‌ సమీప తీరంలో బుధవారం మత్స్యకారుల వలకు ఒకే పరిమాణంలోని చేపలు చిక్కాయి. అధిక సంఖ్యలో లభ్యమవడంతో జాలర్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఆసియాలోకెల్లా అతి పెద్దదైన ఇందిరాగాంధీ స్మారక ‘తులిప్‌’ పూదోటను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో 17 లక్షల పుష్పాలు వికసించిన ఈ తోట వర్ణరంజితంగా శోభిల్లుతూ చూపరులను మైమరపింపజేస్తోంది 

కొడంగల్‌: శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి 45వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించారు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(01-04-2025)

చిత్రం చెప్పే విశేషాలు(31-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(31-03-2025)

Eenadu.net Home