చిత్రం చెప్పేవిశేషాలు
(27-12-2024)
ఓ ద్విచక్ర వాహనదారుడి తలపై హెల్మెట్ వినూత్నంగా, ఆకట్టుకునేలా ఉంది. అసెంబ్లీ చౌరస్తాలో సిగ్నల్ పడినప్పుడు ఇలా కనిపించాడు.
కేరళలోని కోజీకోడ్‌లో బుధవారం మరణించిన జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత వాసుదేవన్ నాయర్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న నటుడు మోహన్‌లాల్ .
తూర్పు తిరుమలగా ప్రసిద్ధి పొందిన బలభద్రపురంలోని ఆలయంలో అన్న కూటోత్సవం నిర్వహించారు. 58 కిలోల పులిహోర, 25 కిలోల స్వీట్లు వినియోగించి..శ్రీనివాసుడి రూపాన్ని అందంగా తీర్చిదిద్దారు.
దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల్లో సునామీ బీభత్సం సృష్టించినా విశాఖలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖ మత్స్యకారులు విశ్వసిస్తుంటారు. విశాఖ తీరంలో గంగమ్మకు పూజలు చేస్తున్న మహిళలు.
గగనతలంలో వేగంగా విహరించే సామర్థ్యం కలిగిన అరుదైన విహంగం వాటిల్ లాప్వింగ్.ఇవి వర్షానికి ప్రతి స్పందనగా తక్కువ దూరం వలస వెళ్తాయి. కొల్లేరులో ప్రస్తుతం 600 వరకు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
హోరెత్తుతున్న సంద్రంలో ఎగిసిపడుతున్న అలలపై స్వారీ చేస్తున్న ఈ చిన్నారులు.. విశాఖపట్నం పెదజాలారిపేట సాగర తీరంలో కనిపించారు. వారిని పలకరిస్తే.. ఎలాంటి శిక్షణ లేకుండానే సర్ఫింగ్ చేస్తున్నారని తెలిసింది.
వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకూ లైనులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.
నగరంలో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. రోజంతా వాతావరణం మేఘావృతమై అల్పపీడన ప్రభావంతో ముసురు పట్టింది. రోడ్లపైకి వరద చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. మధ్యాహ్నం తర్వాత కూడా ఆకాశహర్మ్యాలు కనిపించనంతగా పొగమంచు కమ్మేసింది. చలిగాలులు వణికించాయి.
ట్రాఫిక్ నిబంధనలు, ఇతర సూచనలు, ఆయా అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన డిజిటల్ డిస్‌ప్లే యంత్రాలు ఇవి.