చిత్రం చెప్పే విశేషాలు
28-01-2025
నారాయణగూడ జంక్షన్లో ఫొటో ఫ్రేమ్ నమూనా ఏర్పాటు చేశారు. ఫ్రేమ్‌లోంచి చూస్తే అవతలి వైపు దృశ్యం నిజమైన ఫొటోలా అనిపిస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
బెంగళూరు : మహాశివుడు బొమ్మను రంగోలితో కళాకారుడు సూర్యపురోహిత్ కార్కళ్ వేశార. మహాశివుడి బొమ్మను తీర్చిదిద్దడంతో భక్తులు పరవశులయ్యారు.
ఆ దూడ చిట్టిదైనా చెవులు మాత్రం సాధారణంగా లేవండోయ్.. అలా ఠీవీగా నడిచొస్తూ ఎంచక్కా బహుమతి కొట్టేసింది. తాళ్లరేవు మండలం పత్తిగొంది పశువైద్యశాల ప్రాంగణంలో ఇది ఆకట్టుకుంది.
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మణుగూరులో ఏర్పాటు చేసేందుకు రాజమండ్రి నుంచి తీసుకెళుతున్నారు. ప్రధాన రహదారిపై వాహనంలో ఉన్న శివాజీ విగ్రహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ప్రయాగ్‌రాజ్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి డొనాల్డ్ పెటిట్ అక్కడినుంచి కనిపిస్తున్న కుంభమేళా దృశ్యాలను క్లిక్‌మనిపించారు.
అమెరికా దేశస్థులు ఇద్దరు ఖిలావరంగల్ కోట కట్టడాలు తిలకించేందుకు వచ్చిన సమయంలో కీర్తితోరణాల నడుమ స్తంభానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తుండగా తీసిన చిత్రమిది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కూడలిలో మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళారూపం ఆకట్టుకుంటోంది.
కరీంనగర్: సృష్టిలోని ప్రతి జీవికి సూర్యోదయ ఘడియలు అమృత సమానం. ఆసుపత్రి ఆవరణలో పలువురు సూర్యోదయ కిరణాలు తాకేలా తమ శిశువులను ఎత్తుకున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది.
ఎత్తైన కొండల నడుమ విస్తరించిన విశాఖ మహానగరాన్ని ఏ గిరిపైనుంచి చూసినా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఆకులు రాలిపోయి ఎండిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ చెట్టును తానికాయగా పిలుస్తారు. నిర్మల్-ఆదిలాబాద్ మార్గంలో ఒక్క ఆకు కూడా లేకుండా చెట్టంతా కాయలతో ఒత్తుగా కనిపిస్తుంది.