చిత్రం చెప్పే విశేషాలు
(28-02-2025)
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున ‘పెద్దపట్నం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
మహా కుంభమేళా ముగియడంతో గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద పరిసరాలను శుభ్రం చేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ .
విజయనగర గత వైభవాన్ని చాటే హంపీ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి.విద్యుద్దీపాల వెలుగులో ప్రధాన వేదిక ఆకట్టుకుంటున్నాయి.
మహా కుంభమేళా సందర్భంగా మెరుగైన సేవలు అందించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని గురువారం ప్రయాగ్‌రాజ్ జంక్షన్ స్టేషన్‌లో అభినందిస్తున్న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.
ఈ చిత్రం చూస్తే నింగిలోకి ఎగిరేందుకు విమానం రన్‌వేపై సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఇది విమానాశ్రయం కాదు.. వరంగల్ నగరంలోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నిట్) ప్రాంగణం.
హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లు, చెరువుల చెంత ఆకట్టుకునే బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. మంచు ప్రాంతాల్లో కనిపించే దుప్పుల్లాంటి ఈ బొమ్మలను మీర్‌పేట చెరువు వద్ద అమర్చుతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన నాలుగు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా నర్మదా జిల్లాలో ఏక్తానగర్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సందర్శించారు
నీలగిరి: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్థానిక ఛాయాసోమేశ్వరాలయంలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిపించారు.
మహాశివరాత్రి పూజల అనంతరం గురువారం వేకువజాము నుంచే విశాఖలో పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలకు వచ్చారు.
హైకోర్టుకు వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్‌కు రెండు బ్యాటరీ కార్లు అందజేశారు.