చిత్రం చెప్పేవిశేషాలు
(28-12-2024)
కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు ఆకొండి అంజి భారతదేశ పటంపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చిత్రం గీసి నివాళి అర్పించాడు.
ఆర్థిక సంస్కర్త, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి నివాళిగా శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో నిత్యం రద్దీగా ఉండే సచివాలయం కూడలి నిర్మానుష్యంగా కనిపించింది.
మహాకుంభమేళాను పురస్కరించుకొని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల కోసం ఏర్పాటుచేసిన విలాసవంతమైన డోమ్ సిటీ కాటేజ్‌లు .
అల్పపీడనం ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాలకు సి.ఎస్.పురం మండలం భైరవకోనలోని జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది.
కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 1100 మంది మహిళలు లక్ష పుష్ప, కుంకుమ పూజలు నిర్వహించారు.
మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పిస్తూ పట్నాలో ఓ కళాకారుడు పత్రంపై తీర్చిదిద్దిన మాజీ ప్రధాని చిత్రం.
పొడవాటి మెడ వంపుతో.. నలుపు, గోధుమ వర్ణాలు మిళితమైన శరీర సౌష్టవంతో చూపరులను ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి బ్లాక్ బిటర్న్. కొల్లేటి కొంగను పోలి ఉండే ఈ పక్షిని స్థానికులు నల్ల కొంగగా పిలుస్తుంటారు.
రాయల చెరువులో జలక్రీడల సందడి నెలకొంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా సీనియర్స్, జూనియర్స్ విభాగంలోని క్రీడాకారులు డ్రాగన్ బోట్, జట్టీ సాధన చేస్తున్నారు.
ఆర్థిక సంస్కర్త, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి నివాళిగా శుక్రవారం సంతాప సూచకంగా సచివాలయంపై ఉన్న జాతీయ జెండాను అవనతం చేశారు.