చిత్రం చెప్పే విశేషాలు
29-01-2025
బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఫుడ్ స్టోర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని కొనాలంటే మాత్రం రూ.5 లక్షలు పెట్టాల్సిందే. ఈ చిత్రంలోని రెయిషీ మష్రూమ్.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన జానపద నృత్యం పురూలియా చౌ విశేషంగా ఆకట్టుకుంది. కాకినాడలోని జేఎన్టీయూకే ఆడిటోరియంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 77వ వార్షికోత్సవ సంక్రాంతి గానసభలు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నం: ఈ చిత్రంలో కనిపిస్తున్నది ‘లైఫ్ రాఫ్ట్’. సాగరంలో ప్రయాణించేటప్పుడు నౌకలు ప్రమాదానికి గురైతే చివరి ప్రయత్నంగా దీన్ని ఉపయోగించి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడతారు.
మంచుకొండల తరహాలో కనిపిస్తున్న ఈ గుట్టలు సత్తుపల్లి సింగరేణి ఓసీ సమీపంలోవి. తెల్లని పొరతో మంచు పర్వతాల్లా కనిపిస్తున్న ఇవి మట్టి గుట్టలే.
ఇస్రో చేపడుతున్న వందో ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం ఉదయం 6:23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు.
అలసిన మనసు.. ఆపదేం తెలుసు?! ట్రాక్టరు ట్రాలీకి ఇరువైపులా రక్షణ రేకులు లేవు. మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్ వైపు ప్రమాదకరంగా వెళ్తుండగా క్లిక్‌మనిపించిన చిత్రమిది.
శంకర్పల్లి మండలం ప్రొద్దటూర్‌లో ఏర్పాటైన ఎక్స్పీరియం ఎకో పార్కును మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉద్యానంలో ఏర్పాటు చేసిన దోమ ఆకృతిలోని భారీ నమూనా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విజయవాడ-గుంటూరు వారధి కింద ఇసుక తిన్నెల్లో యువకుల క్రికెట్ చిత్రమిది. నది మధ్యలో కాంక్రీట్‌తో పిచ్ ఏర్పాటు చేసుకుని క్రికెట్ ఆడుతున్న యువకులు.
ఆనందపురం-తగరపువలస మార్గంలో జాతీయ రహదారిపై రాజులతాళ్లవలస వద్ద మంగళవారం రాత్రి మంచును చీల్చుకుంటూ నేలను తాకుతున్న విద్యుద్దీపాల కాంతులు ప్రయాణికులను ఆకట్టుకున్నాయి.