#eenadu
సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందుకుంటున్న శ్రీజేష్ (హాకీ), అశ్విన్ (క్రికెట్)
తూర్పు మేదినీపుర్‌లో నిర్మిస్తున్న జగన్నాథ ఆలయం పనులను పరిశీలిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పద్మభూషణ్ అవార్డు అందుకొనే వేళ కుటుంబ సమేతంగా నందమూరి బాలకృష్ణ. చిత్రంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, సోదరి నారా భువనేశ్వరి, కుమారుడు మోక్షజ్ఞ తేజ, ఏపీ మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఎంపీ శ్రీభరత్, తేజస్విని
ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జయంతి సందర్భంగా అరసవల్లికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ పక్షి ఈకపై ఆయన చిత్రాన్ని వేశారు.
రాయదుర్గంలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో సోమవారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ షో సందడిగా సాగింది.
గుత్తులుగుత్తులుగా విరబూసిన ఈ పూలు మల్లె, సన్నజాజి కావు. ప్రస్తుతం సీజన్ కావడంతో కాఫీ మొక్కలకు విరబూసిన పూలు. విశాఖపట్నం ప్రధాన రహదారికి ఇరువైపులా అటవీశాఖ కాఫీ తోటల్లో ప్రస్తుతం ఇవి దర్శనమిస్తున్నాయి.
సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ అధిపతి ఒసాము సుజుకీకి మరణానంతరం లభించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన తరఫున భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి స్వీకరిస్తున్న సుజుకీ మోటార్ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ
ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబు కానుంది. చార్మినార్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను అలంకరించనున్నారు.
గూడెంకొత్తవీధి: మహిళ చేతిలో ఉన్నది హైబ్రీడ్ వంకాయ అనుకుంటున్నారా.. కాదు. అది గుమ్మడి కుటుంబానికి చెందిన జుకుని.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నివాళులర్పిస్తున్న శాసనసభ్యులు
హైదరాబాద్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన లోకాయుక్త జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిని, ఉప లోకాయుక్త జస్టిస్ బి.ఎస్.జగ్జీవన్ కుమార్‌లను రాష్ట్ర డీజీపీ జితేందర్ సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ హితమే అతడి ఆకాంక్ష.. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లికి చెందిన భూక్యా అంజి అలియాస్ ఆటో అంజి. ఆటో చుట్టూ, పైన పలు రకాల మొక్కలు అమర్చి వాటిని కాపాడుకుంటూ ప్రధాన పట్టణాల్లో పర్యటిస్తున్నారు.
ఇచ్చోడ: చిత్రంలో చెట్టుపై కనిపిస్తున్నవి తేనెపట్టు కాదు.. గబ్బిలాలే. సాధారణంగా గబ్బిలాలు చెట్లపై, గుహల్లో నివాసం ఏర్పరుచుకుంటాయి.