చిత్రం చెప్పే విశేషాలు
30-01-2025
ఆలోచన ఉండాలే గాని.. పాత వస్తువులను కూడా తిరిగి వినియోగించుకోవచ్చు. దీనికి ఉదాహరణ ఈ లస్సీ బండే. గాజువాకకు చెందిన టి.శ్రీను లస్సీ అమ్ముతారు.
రాజోలు మండలం పొదలాడకు చెందిన కాకర రవితేజ తీసిన చిత్రానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. మలికిపురంలోని రక్తతుల్య నదిలో జాలర్ల చేపట వేటకు సంబంధించిన చిత్రం ఆకట్టుకోవడంతో ప్రథమ స్థానంతో పాటు బంగారు పతకం లభించింది.
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని గోడలపై జంతువులు, పక్షలు, అందమైన ఆకృతులు గీస్తున్నారు. పాతాస్పత్రి, సింగ్‌నగర్ రైతుబజార్, వాంబేకాలనీ, ఆర్‌ఆర్‌పేట ప్రాంతాల్లో ఆర్టిస్టులు గీసిన ఈ చిత్రాలు కనువిందు చేస్తున్నాయి.
సాలూరు: ఈ చిత్రంలో కనిపిస్తున్న కొండ ప్రతిబింబం కొబ్బరి కాయను పోలేలా అబ్బురపరుస్తోంది కదూ.. ఇది వెంగళరాయ జలాశయంలో బుధవారం ఆవిష్కృతమైంది.
సింహాచలం :వరాహ లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం అప్పన్న పుష్కరిణిలో బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించారు.
నారాయణగూడలో వంతెన కింద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెలుగు జిలుగుల మధ్య ఫౌంటెయిన్ రంగులు వెదజల్లుతూ బాటసారులను ఆకట్టుకుంటోంది.
మనిషంత గెల.. మోసేదెలా?..కొమరాడ మండలం గంగరేగువలసకు చెందిన కె.సాయిబాబు అరటి తోటలో నిలువెత్తు గెల కాసింది.
అనకాపల్లి: పొట్టనింపుకొనేందుకు చెరువులో చేపలకోసం వెళ్లిన కొంగ వ్యర్థాలకు చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలు.. ప్రాణాలు వదిలేసిందిలా..
విశాఖపట్నం: బస్సు, పాములు, అటవీ జంతువుల బొమ్మలతో అక్కడి గదులు చూసేకొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి. వైద్యుల వద్దకు పెద్దలు పరీక్షకు వెళితే... కొందరు చిన్నారులు బొమ్మల వద్ద సందడిలో మునిగితేలుతున్నారు.
మాదాపూర్ ఐటీ కారిడార్ రహేజా మైండ్ స్పేస్ స్కైవాక్ మధ్యలో పైలాన్ ఏర్పాటు చేశారు. రంగుల దీపాలతో పాటు చుట్టూ ఉన్న ఐటీ కార్యాలయాల వెలుగుల్లో ఈ పైలాన్ రాత్రి వేళ వెలుగుతోంది.