చిత్రం చెప్పేవిశేషాలు

(30-12-2024)

 నావికాదళ సన్నాహక ప్రదర్శనల్లో 

భాగంగా ఆదివారం సాయంత్రం

సాగర తీరంలో యూహెచ్‌ 

త్రీహెచ్‌ హెలికాప్టర్‌ విన్యాసం

ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సుందరంగా ముస్తాబైంది. ఈ కోవెలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాల ట్రయల్‌ రన్‌ను ఆదివారం రాత్రి పరిశీలించారు. 

అక్షరాలతో రూపొందించిన హ్యాండ్‌ బ్యాగ్, కూడికల యంత్రం, చిట్టి బుర్రలో ఇమిడే అక్షరమాల ఇలా లోకాస్ట్‌-నోకాస్ట్‌ సామగ్రితో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు రూపొందించిన బోధనోపకరణాలు ఆకట్టుకున్నాయి. చిట్టి రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కేరళలోని కొచ్చిన్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం భరతనాట్యం చేస్తున్న కళాకారులు. ఒకే వేదికపై ఇచ్చిన ప్రపంచంలోనే అతి భరతనాట్య ప్రదర్శనగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం భైరవకోనలోని జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. ఎత్తయిన కొండల పైనుంచి పాల నురగను తలపించేలా జలాలు జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. 

 ప్రీతి పట్నాయక్‌ (12) మిస్‌ ప్రీ-టీన్‌ ఇండియా-2024 పోటీలో విజేతగా నిలిచింది. అలాగే ఆగస్టులో బ్యాంకాక్‌లోని థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రాణించి మిస్‌ ప్రీటీన్‌ వరల్డ్‌-2024 విజేతగా నిలిచారు.

ముఖమంతా నల్లటి వర్ణంతో కనుల కింద తెల్లటి చారతో.. తలపై పసుపు టోపీ ధరించినట్లు చూపరులను కనువిందు చేసే కొల్లేరు అందాల అతిథి ఎల్లో క్రౌన్డ్‌ హెరాన్‌.ప్రస్తుతం ఈ పక్షులు కొల్లేరులో 1500 వరకు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. 

తాండూరు ఆర్యవైశ్య మహిళా సంఘం ముగ్గుల పోటీలను ఆదివారం నిర్వహించగా సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న దుష్ప్రభావాలపై వేసి బహుమతి అందుకున్నారు.  

నెల్లూరు నగరంలో కనిపించిన పల్సర్‌ బండి ఇది. పెద్ద బరువులు లాగడానికి తగినట్లు ఓ ట్రాలీని అనుసంధానం చేయడంతో.. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

చిత్రం చెప్పేవిశేషాలు(04-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(03-01-2025)

Eenadu.net Home