చిత్రం చెప్పే విశేషాలు
31-01-2025
ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి, ఆసక్తిగా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో ఏపీపీజేఏ సభ్యులు.
శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా కనపడే గొల్లభామ (హుడెడ్ గ్రాస్‌హూపర్) పద్మనాభం గ్రామంలో గురువారం సందడి చేసింది. ఎంతో తరచి చూస్తేగాని అసలు గుర్తుపట్టలేని విధంగా ఆకుల్లో కలిసిపోయింది.
దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గురువారం మహాత్ముడికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిత్రంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్.
కొందరు వ్యాపారులు ఏకంగా కంటెయినర్‌నే దుకాణంగా మార్చి రాష్ట్రాలు చుట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలో తిరుగుతూ డోర్ కర్టెన్లు, కార్పెట్లు, మ్యాట్లు, దుప్పట్లు విక్రయిస్తున్నారు. ఆ వాహనమే వారి దుకాణం, నివాసం కూడా.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం ఎండు మిరప పోటెత్తింది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా సుమారు 52 వేల బస్తాలు రావడంతో మార్కెట్ కళకళలాడింది.
కందుకూరు పట్టణం: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వందో ప్రయోగం విజయవంతం కావడంతో పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శన చేశారు.
చూడటానికి ఒకే గుడ్ల గూబలా కనిపిస్తోంది కదూ.. కానీ ఇవి రెండు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠం వద్ద రావిచెట్టు తొర్రలో రెండు గుడ్ల గూబలు నివాసం ఉన్నాయి.
నిజామాబాద్: పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఆయన ఓ ఆలోచన చేశారు. గాలికి ఫ్యాన్ తిరిగినపుడు దానికి వెనక ఉన్న ఇనుప చువ్వల కింద డబ్బాకు తాకి శబ్దం రావడంతో పక్షులు బెదిరిపోయి తోట జోలికి రావడం లేదు.
కొత్తగూడెం: ఈ చిత్రాన్ని చూస్తే ఎక్కడో అటవీ ప్రాంతంలోంచి ఏనుగు రోడ్డుపైకి వచ్చినట్లు అనిపిస్తోంది కదూ? కానీ, ఇది నిజం కాదండీ. ఓ వివాహ వేడుకలో ఆకర్షణ కోసం ఏనుగు విగ్రహాన్ని తెప్పించి ప్రవేశ ద్వారం చెంత నిలబెట్టారు.
పార్వతీపురం మన్యం: ఏళ్లుగా పచ్చగా ఎదిగిందా చెట్టు. ఎన్నో జీవాలకు నీడనిచ్చింది. కొన్ని రోజులుగా అది ఎండిపోతూ వస్తోంది. గబ్బిలాలు తోడుగా నిలిచాయి.
నారాయణపేట: కొంచెం ఆలోచించి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటే చాలు.. ఎన్నో లాభాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం అలాంటిదే!