చిత్రం చెప్పే విశేషాలు
(31-03-2025)
జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం గ్రామదేవత గోగులమ్మ ఆలయాన్ని కోటి మట్టిగాజులతో అలంకరించారు. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్న ఈ భవనాన్ని చూస్తే ముచ్చటేస్తుంది కదా. గచ్చిబౌలి రహేజా మైండ్ స్పేస్ నుంచి ఏఐజీ ఆసుపత్రి వెళ్లే మార్గంలో నిలువెత్తు వనంలా కనిపిస్తున్న ఈ సువిశాల భవంతి అన్ని అంతస్తులను తీగ అల్లుకుంది.
చార్మినార్: మీరాలం ఈద్గాలో షామియానాల ఏర్పాటు.. కిటకిటలాడుతున్న రాత్‌బజార్
శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం నేత్రశోభితంగా జరిగింది.
ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బృందం బంగారు కిరీటాన్ని బహూకరించింది.
రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మహారాష్ట్రలోని ముంబయిలో ఆదివారం గుడిపడ్వా సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి ద్విచక్ర వాహనాలపై దూసుకుపోతున్న మహిళలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఉగాది నుంచి ఏప్రిల్ 12 వరకు కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని బంగారు పట్టుచీర, పసుపు, కుంకుమ, మామిడి కాయలు, వేపకొమ్మలు, ఆభరణాలు, మువ్వలు, పూలతో అలంకరించారు.
ఆకులు...కొమ్మలు విరిగిపోయాయి. చెట్టు మొదళ్లు అలాగే ఉండిపోవడంతో అధికారులు వాటిని పాడుచేయకుండా దుంగలకు రంగులద్ది, ఓ స్థానం కల్పించడంతో సరికొత్త అవతారం ఎత్తాయి.
ఆదివారం కూకట్‌పల్లి గ్రామంలోని రామాలయంలో భక్తులు