చిత్రం చెప్పేవిశేషాలు
(31-12-2024)
హనుమజ్జయంతి సందర్భంగా తమిళనాడులోని నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పుష్పాలతో ముస్తాబు చేశారు.
కుప్పం అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పురపాలిక పరిధిలోని కుప్పం చెరువు కట్ట ప్రహరీకి రంగులు వేసి, చిత్రాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ‘ఐ లవ్ కుప్పం’ అంటూ వేసిన చిత్రం.. ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరిస్తుండడంతో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఖాజాగూడ కూడలి నుంచి నానక్‌రాంగూడ మార్గంలోని డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతుల దీపాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితిలో దట్టమైన మంచుకొండల్లో పర్యాటకుల సందడి
శీతాకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కృష్ణా తీరంలోని అమరగిరి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్, పచ్చని గుట్టలతో నిండి ఉండే ఈ ప్రాంతం ఉదయం వేళ పొగమంచులో మరింత సుందరంగా కనిపిస్తోంది.
శిల్పారామంలో సోమవారం కళాకారులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. నాట్యగురువు సత్యప్రియ రమణ శిష్యబృందం కూచిపూడి నృత్యంతో కనువిందు చేశారు.
తలపై భాగంలో టోపీ ధరించినట్లు ముక్కు చివరి వరకు నల్లటి వలయంతో తెలుపు బూడిదరంగు మిళితమైన శరీర సౌష్టవంతో చూపరులను ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి గుల్ బిల్డ్ టేర్న్.
అమావాస్య సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో సోమవారం గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు .