చిత్రం చెప్పే విశేషాలు!

(16-11-2022/1)

ప్రముఖ నటుడు కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పద్మాలయ స్టూడియోలో ఆయన పార్థివ దేహానికి ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పించారు.

source:Eenadu

స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డప్పు వాయిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌.

source:Eenadu

ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా లాల్‌దర్వాజాకు చెందిన ఆటోడ్రైవర్‌ చరణ్‌ తన ఆటోకు ఇలా రక్షణగా కంచె ఏర్పాటు చేశాడు. మహిళల మెడలో గొలుసులు, హ్యాండ్‌బ్యాగులు ఎవరూ లాక్కుని ఉడాయించకుండా ఇలా చేసినట్లు చెప్పాడు.

source:Eenadu

సమయానికి కళాశాలలకు వెళ్లాలన్న ఆతృతలో విద్యార్థులు బస్సుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. దేవరకద్రకు వెళ్లే మార్గంలోని పలు కళాశాలల విద్యార్థులు ఉదయం, సాయంత్రం బస్సుల ఫుట్‌బోర్డులపై గుంపులుగా వేలాడుతూ వెళ్తున్నారు. 

source:Eenadu

ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలను అటవీ జంతువులు, పక్షుల నుంచి రక్షించుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ పంచాయతీ పరిధిలోని అటవీప్రాంతంలో అంద్‌గూడకు చెందిన జనార్దన్‌ తన కుటుంబంతో పంట పొలంలో మంచెపై ఆవాసముంటున్నారు.

source:Eenadu

అనకాపల్లి- ఆనందపురం ఆరువరుసల జాతీయ రహదారి పనులు పెందుర్తి మండలం గుర్రంపాలెం వద్ద అసంపూర్తిగా ఉన్నాయి. వాహనాలను అదుపుచేయలేక ఢీ కొంటున్నారు. మంగళవారం ఉదయం ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో ఇదిగో... ఇలా కిందపడిపోయారు.

source:Eenadu

కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ వద్ద మురుగు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైలు దిగి ఇళ్లకు చేరుకోవడానికి బస్సు ఎక్కాలంటే ఇలా సర్కస్‌ ఫీట్లు చేయాల్సిందే.

source:Eenadu

జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నిర్వహించే బాలల అసెంబ్లీ కార్యక్రమంలో నల్గొండకు చెందిన నలుగురు నృత్యకారులు పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు. 

source:Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (28-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(27-03-2024/1)

Eenadu.net Home