చిత్రం చెప్పే విశేషాలు
(05-04-2023/2)
కథానాయిక రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే టూ అవర్ శ్రీవల్లి’ అంటూ రాసుకొచ్చింది.
Source: Eenadu
ఓ షూటింగ్‌లో గాయపడి విశ్రాంతి తీసుకున్న బిగ్‌బీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ఈ ఫొటోలను చూసి అమితాబ్ బచ్చన్ అభిమానులు సంబరపడుతున్నారు.
Source: Eenadu
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Source: Eenadu
ఉపాసన సీమంతాన్ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
Source: Eenadu
భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం, సుదర్శన మూర్తికి చక్రతీర్థం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Source: Eenadu
న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కిమ్ కాటన్ అనే మహిళ.. అంపైర్‌గా వ్యవహరించారు. మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఫిమేల్ అంపైర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. (సోర్స్: ఐసీసీ ట్విటర్ ఖాతా)
Source: Eenadu
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తమ జట్టులోని అఫ్గాన్ క్రీడాకారులతో కలిసి సెహరీ చేశారు. ఈ ఫొటోను రషీద్‌ఖాన్ ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తమతో కలిసి పాండ్య భోజనం చేయడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
Source: Eenadu
అహ్మదాబాద్‌లో ‘పంగుని ఉతిరం’ ఉత్సవంలో భాగంగా పలువురు భక్తులు ఇనుప రాడ్లను శరీరానికి గుచ్చుకొని కనిపించారు. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా కారును లాగుతూ కనిపించారు. మురుగన్ అనే దేవుడికి భక్తులు ఇలా మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
Source: Eenadu
సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంది. ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Eenadu