చిత్రం చెప్పే విశేషాలు
(06-04-2023/1)
ఇది కాకినాడ జిల్లా యానాంలోని బీచ్ రోడ్డులోని శివలింగం వద్దనున్న రావి చెట్టు. రుతు ధర్మం ప్రకారం మాఘ, ఫాల్గుణ మాసాల్లో ఆకులు రాలి మోడుగా కనిపిస్తుంది.చైత్ర, వైశాఖ మాసాల్లో చిగురులు తొడిగి కళకళలాడుతూ చల్లని నీడనిస్తోంది.
Source:Eenadu
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానం కనుల పండువగా జరిగింది. 53 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను అందించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి, సామాజికవేత్త సుధామూర్తిలు పద్మభూషణ్‌ను అందుకున్నారు.
Source:Eenadu
అమెరికాలోని మిస్సోరీ ఆగ్నేయ ప్రాంతంలో బుధవారం టోర్నడో ధాటికి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చాలామంది గాయపడినట్లు చెప్పారు. టోర్నడో బొలింగర్ కౌంటీ నుంచి సెయింట్ లూయీస్‌కు 80కి.మీ. దూరం వరకూ కొనసాగినట్లు వెల్లడించారు.
Source:Eenadu
విజయనగరం జిల్లా వంగర మండలంలోని చంద్రమ్మపేట, చౌదరివలస, కోనంగిపాడు తదితర గ్రామాల ప్రజల కష్టాలివి. మండల కేంద్రానికి రావాలంటే మధ్యలో ఉండే వేగావతి నదిని దాటాల్సిందే. దగ్గర మార్గం కావడంతో ఇలా ప్రమాదకరంగా రోజూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
Source:Eenadu
వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాద్యాల మధ్య కల్యాణం క్రతువు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేడుకగా సాగింది.
Source:Eenadu
ఈ చిత్రంలోని చెట్టును నిశితంగా పరిశీలిస్తే అందులో కొమ్మకొమ్మకు రామచిలుకలు కనిపిస్తాయి. కామారెడ్డి రైల్వేస్టేషన్ ఆవరణలోని ఓ వృక్ష్యాన్ని నివాసంగా మార్చుకున్నాయి. ఉదయాన్నే ఎటో వెళ్లిపోతాయి.. సాయంత్రమైందంటే గుంపులుగుంపులుగా చేరి సందడి చేస్తుంటాయి.
Source:Eenadu
కాకతీయుల కాలం నాటి అపురూప రాతి కట్టడాలున్న వరంగల్‌లోని ఖిలా వరంగల్ కోటను రష్యా దేశస్థులు బుధవారం సందర్శించారు. మధ్యకోట కళాతోరణాల నడుమ కింద పడిపోయి ఉన్న శిల్పాలను ఆసక్తిగా తిలకించడంతోపాటు తమ కెమెరాల్లో బంధించుకోవడం కనిపించింది.
Source:Eenadu
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో ఓ వ్యాపారి వద్ద గులాబీ కంటే చిన్నదైన గోబీ పువ్వు కనిపించింది. విక్రయించేందుకు మార్కెట్‌లో గుత్తగా కాలీఫ్లవర్లను ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. అందులో గులాబీ పువ్వు కంటే చిన్నగా ఉందంటూ స్థానికులూ ఫొటోలు తీసుకుని ముచ్చటపడ్డారు.
Source:Eenadu
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో బుధవారం చైత్రపౌర్ణమి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలు, దేవీ పీఠాల్లో అభిషేకాలు, అర్చకులు నిర్వహించారు. బలగ కాలభైరవ ఆలయంలో దేవీ ఉపాసకులు పొగిరి గణేష్ నిర్వహణలో లక్ష్మీరూపేణా శ్రీచక్రార్చన సిరిపూజలు చేశారు.
Source:Eenadu
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి సైబీరియన్ పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి జనవరిలో వచ్చి..6 నెలలపాటు చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకుని తమ సంతతిని వృద్ధి చేసుకొని వెళ్తాయని, గత 50 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ సాగుతోందని స్థానికులు తెలిపారు.
Source:Eenadu