చిత్రం చెప్పే విశేషాలు

(08-04-2023/1)

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని బాబుసాల పంచాయతీ జడిగుడ గ్రామ సమీపంలోని జలపాతం వేసవిలోనూ గలగలపారుతోంది. బల్లుగుడ నుంచి వచ్చే గెడ్డ ప్రవాహం తగ్గింది. అయినా పచ్చని కొండల మధ్య ఎత్తైన బండరాళ్ల పై నుంచి జారుతున్న జలపాతం పాలనురగలా దర్శనమిస్తోంది.

Source:Eenadu

ఇండోనేసియాలోని యే మాలెట్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం కళేబరాన్ని తొలగిస్తున్న సిబ్బంది.

Source:Eenadu

అటవీ ప్రాంతంలో పెరిగే గచ్చకాయల చెట్టు ఇది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని నగరం అటవీ ప్రాంతంలో కనిపించాయి ఈ చెట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు వీటితో గచ్చకాయల ఆట కూడా ఆడుతుంటారు.

Source:Eenadu

బాలీవుడ్‌ నటి కరిష్మాకపూర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో సందడి చేశారు. టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనంమీర్జా, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని అభిమానులతో సెల్ఫీ దిగారు.

Source:Eenadu

సూర్యచంద్రులను ఇంద్రధనస్సు చుట్టుముట్టి చూపరులకు కనువిందు చేసింది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో శుక్రవారం ఉదయం 11.26 గంటల సమయంలో ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరాలో బంధించింది.

Source:Eenadu

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలో ఎదురబోయిన వీరస్వామి ఇంటి పెరటి చెట్టుకు ఇలా వింత ఆకారంలో నిమ్మకాయలు కాయడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

Source:Eenadu

వరంగల్‌ జిల్లాలోని నిట్‌లో శుక్రవారం వసంతోత్సవ వేడుకలు నిర్వహించారు. క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రో షోలో హిందీ, తెలుగు గాయకులు అనురాగ్‌ హల్దీర్, సాకేత్‌ గీతాలు ఆలపిస్తుంటే, వాటికి అనుగుణంగా విద్యార్థులు నృత్యం చేస్తూ కేరింతలు కొట్టారు.

Source:Eenadu

విశ్వశాంతి కోసం ఏసు ప్రభువు తన ప్రాణాలను త్యాగం చేశారని పలువురు పాస్టర్లు సందేశమిచ్చారు. శుభ శుక్రవారం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఏసును శిలువ వేసిన సన్నివేశాన్ని పలుచోట్ల కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

Source:Eenadu

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చెంత ఏర్పాటైన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తవడంతో చుట్టూ ఉన్న కర్రలను తొలగించారు. దీంతో శుక్రవారం అటుగా వెళ్లే వాహనదారులు సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

Source:Eenadu

వరంగల్‌ జిల్లా నర్సంపేట మహిళా కారాగారంలోని మామిడి చెట్టు ఇది. నిర్మాణ పనులకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మను కొన్నాళ్ల కిందట నరికేశారు. అలా నరికిన కణుపు వద్ద చిగురించి రెండు మామిడి కాయలు గుత్తి(జంట)గా పెరుగుతూ కనువిందు చేస్తున్నాయి.

Source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

Eenadu.net Home