చిత్రం చెప్పే విశేషాలు
(09-04-2023/2)
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇండియన్ 2’. ఈ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్ దక్షిణాఫ్రికా వెళ్లారు.
Source: Eenadu
సినీనటి ఆషికా రంగనాథ్ తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆషికా రంగనాథ్, కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ‘అమిగోస్’ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Eenadu
భారతీయ చిత్రం ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో ముదుమలై టైగర్ రిజర్వును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బెల్లీలను కలిశారు.
Source: Eenadu
నటులు సాయిధరమ్ తేజ్, జగపతిబాబు, అజయ్‌లతో కలిసి దిగిన ఫొటోను బ్రహ్మాజీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. వారిని ‘బ్యూటిఫుల్ సోల్స్’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
Source: Eenadu
సినీనటుడు అల్లు అర్జున్ శనివారం తన జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన అభిమానులకు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.
Source: Eenadu
సల్మాన్‌ఖాన్, పూజా హెగ్డే, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
సినీనటి నేహాశెట్టి తన తాజా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ ఆమె ఫ్యాన్స్ లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ‘బెదురులంక 2012’ త్వరలో విడుదల కానుంది.
Source: Eenadu
యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోపెట్టుబడిదారుల సదస్సు-2023 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సదస్సుకు సంబంధించిన కర్టెన్‌రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Source: Eenadu
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాలువా ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఇది చేనేత శాలువా అని, శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ హాజరై ఉంటే ఆయన్ను దీనితో సత్కరించే వాళ్లమని తెలుపుతూ పోస్టు పెట్టారు.
Source: Eenadu
ఐపీఎల్ 16లో భాగంగా ఉప్పల్‌లో హైదరాబాద్, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ పండగ వాతావరణం నెలకొంది. యువతులు ఇలా మెరిశారు.
Source: Eenadu