చిత్రం చెప్పే విశేషాలు

(10-04-2023/2)

‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో పులి సైకతశిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు.

Source: Eenadu

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చంద్రబోస్‌, ఎం.ఎం.కీరవాణిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంత ఇలా మెరిసింది. అభిమానులతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేసింది.

Source: Eenadu

నూతన సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని డీజీపీ అంజనీకుమార్‌, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ శాంతికుమారి తదితరులు సందర్శించారు. ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతి రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Source: Eenadu

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర అనంతపురంలోని శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోడనంపల్లి క్రాస్‌ వద్ద లోకేశ్‌.. గొర్రెల పెంపకందారులను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

Source: Eenadu

ఇటీవల సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు ఫొటోషూట్‌లో దిగిన ఫొటోను పలువురు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొత్త లుక్‌లో కనిపించిన మహేశ్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. సంయుక్తను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Source: Eenadu

సునీల్‌, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కంభంపాటి సంతోశ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రానికి ‘పారిజాత పర్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Source: Eenadu

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని దేవి థియేటర్‌లో ‘బలగం’ సినిమా చూశారు.

Source: Eenadu

సిబ్లింగ్స్‌ డే సందర్భంగా ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘ఎంతో మంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నా.. ధైర్యంతో మంచి వైపు నిల్చున్న వ్యక్తి నా సోదరుడు’ అని ఆమె పోస్టు పెట్టారు.

Source: Eenadu

ఐపీఎల్ 16లో భాగంగా మంగళవారం దిల్లీలో ముంబయి, దిల్లీ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన దిల్లీకి చేరుకుంది. ‘కొత్త కుర్రాళ్లతో ఈసారి బరిలోకి దిగుతున్నాం’ అని ముంబయి ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

Eenadu.net Home