చిత్రం చెప్పే విశేషాలు

(11-04-2023/1)

హైదరాబాద్‌ నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో నిత్యం రద్దీగా కనిపించే రహదారులు బోసిపోతున్నాయి. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావడం లేదు. గంట గంటకు గొంతు తడుపుకొంటూ స్థిమితపడుతున్నారు. మరోవైపు వేడి భరించలేక నీటిలోకి దిగి ఉపశమనం పొందుతున్నారు.

Source:Eenadu

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజుపాలేనికి చెందిన ఉద్దరాజు రామరాజు ఇంటి పెరట్లో ఉన్న చెట్టు గుత్తులు గుత్తులుగా కాసి కనువిందు చేస్తోంది. కొమ్మల వద్ద 150 నుంచి 200కు పైగా కాయలు కాశాయి.

Source:Eenadu

టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్‌లో సందడి చేశారు. సోమవారం కింగ్స్‌ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో ఇలా ఫొటోకు పోజిచ్చారు.

Source:Eenadu

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన గొట్టెముక్కుల విజయ, రాములు వీళ్లు. విజయకు 57 ఏళ్ల పింఛను కార్డు మంజూరైనప్పటికి రాకపోవడంతో ఆమె గత దరఖాస్తు రసీదులను మెడలో మాలగా వేసుకొని సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చారు.

Source:Eenadu

ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెస్ట్‌ బ్యాంక్‌లో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వలసదారులు..

Source:Eenadu

వేసవి ఎండల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ వేడిమికి తట్టుకోలేక జనం ఉరుకులు..పరుగులు తీస్తుంటే.. యాదాద్రి ఆలయ సన్నిధిలోని బస్‌బే సముదాయం కప్పుపైన క్యూరింగ్‌ కోసం నిల్వ చేసిన నీటిలో.. కోతులు ఇలా ఉపశమనం పొందుతూ.. జలకాలాడాయి.

Source:Eenadu

గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. విజయవాడ నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే దుర్గగుడి పైవంతెన సోమవారం మధ్యాహ్నం వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా కనిపించింది.

Source:Eenadu

సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు గ్రామాల నుంచి 236 మంది గర్భిణులు స్కానింగ్‌ కోసం వచ్చారు. తగిన సదుపాయాలు లేక ఓపీ కేంద్రం వద్ద ఎండలో ఉదయం 9 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నవారు సాయంత్రం 4 గంటల వరకు నిరీక్షించారు.

Source:Eenadu

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపించింది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడ ఖాళీ స్థలంలో పార్కింగుకు కొంత కేటాయించగా మిగిలిన ప్రదేశంలో పచ్చిక ఏర్పాటు చేస్తున్నారు.

Source:Eenadu

హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన నిమ్స్, గాంధీ వద్ద సోమవారం పరిస్థితి ఇది. జిల్లాల నుంచి మెరుగైన చికిత్స కోసం తెల్లవారుజాము నుంచే ఓపీ కౌంటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు.

Source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

Eenadu.net Home