చిత్రం చెప్పే విశేషాలు

(13-04-2023/2)

ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’ సినిమా డైరెక్టర్ వేణు.. తన కుమారుడితో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి వెంట రచ్చ రవి కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Source: Eenadu

నటి లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్‌ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆకుపచ్చ వర్ణం.. చీరకట్టులో మెరిసిన లావణ్య ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Source: Eenadu

‘దసరా’ మార్చి 30న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘డియర్ నాని ‘దసరా’ సినిమా చాలా బాగుంది. నీ నటనతో అందర్నీ మెప్పించావు.’ అంటూ రాసుకొచ్చారు.

Source: Eenadu

జలియన్‌వాలాబాగ్‌లో మృతి చెందిన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్విటర్‌ వేదికగా నివాళి అర్పించారు. ఇందుకు సంబంధించిన పాత ఫొటోను పంచుకున్న ఆమె.. వారు చేసిన త్యాగాన్ని భారత దేశ పౌరులందరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.

Source: Eenadu

చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ను సినీనటి ఐశ్వర్య రాజేశ్‌ వీక్షించారు. సీఎస్కే ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఆమె కనిపించారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.

Source: Eenadu

ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌.. అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫరెల్‌కు బుధవారం సాయంత్రం తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నేటి నుంచి నంద్యాల జిల్లాలో కొనసాగనుంది. జిల్లాలోని ప్యాపిలి మండలం డి.రంగాపురంలో ఉదయం 10.30 గంటలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్‌కు తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Source: Eenadu

మంత్రులు హరీశ్‌ రావు, సబిత ఇంద్రారెడ్డి వికారాబాద్‌లోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అనంతగిరి కొండల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్‌ ఆసుపత్రికి వారు శంకుస్థాపన చేశారు.

Source: Eenadu

ఫ్లోరిడాలోని రెండేళ్ల శునకం ‘పర్ల్‌’ ప్రపంచంలోనే అతి పొట్టి శునకంగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది. సెప్టెంబర్‌ 1, 2020న జన్మించిన దీని బరువు 553 గ్రాములు, 3.50 అంగుళాల ఎత్తు, 5 అంగుళాల పొడవు ఉంది.

Source: Eenadu

సినీ నటి నేహా శెట్టి తన తాజా ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆమె ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించి మెరుస్తూ కనిపించారు. అభిమానులు ఆమె ఫొటోలకు ఫిదా అవుతున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' సినిమా త్వరలో విడుదల కానుంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home