చిత్రం చెప్పే విశేషాలు

(14-04-2023/1)

బురద నీటి కుంటలో చిక్కుకున్న ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారులు రక్షించారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుళ్య తాలూకా అజ్జావర గ్రామ పరిధిలోని కుంటలో 4 ఏనుగులు చిక్కుకోగా.. బయటికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత వాటిని అడవిలోకి మళ్లించారు.

Source:Eenadu

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లాలోని తూటిపాలకు చెందిన సూక్ష్మకళాకారుడు బి.రవికుమార్‌. 1597 తోటకూర గింజలతో 14 గంటలపాటు శ్రమించిఈ చిత్రం మలిచారు. అంబేడ్కర్‌ పేరును సూక్ష్మలిపిలో 238 సార్లు రాశారు.

Source:Eenadu

ఈ చిత్రంలోని మామిడి వృక్షాన్ని చూస్తే ఒక దానిపై మరొక చెట్టు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది కదూ. నిజానికి ఇది ఒక్కటే వృక్షం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలం గొందిపాకలు వద్ద ఉన్న ఈ చెట్టు అటుగా వెళ్లే పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Source:Eenadu

రెణ్నెల్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు సిద్దిపేట పట్టణం బాలికల జూనియర్‌ కళాశాల ఎదురుగా ఫుట్‌బాల్‌ కోర్టు పనులు చేస్తున్నారు. పెద్దలు పనుల్లో నిమగ్నమై ఉండగా కర్రలు బిగించి ఏర్పాటు చేసిన చీర ఊయలలో తమ్ముడిని పడుకోబెట్టే బాధ్యత చిన్నారి అక్క చేపట్టింది.

Source:Eenadu

ప్రస్తుతం తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభానికి ఎదురుచూస్తోంది. మరోవైపు అమరుల స్మృతి చిహ్నం ఆకట్టుకుంటోంది. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో ఈ ప్రతిబింబం ఆకట్టుకుంది.

Source:Eenadu

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో ఫైర్‌మెన్‌ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక సిబ్బంది విధులను సూచించే ఆకృతులు

Source:Eenadu

రంగోలీ బిహు ఉత్సవాల్లో భాగంగా గురువారం అస్సాంలోని గువాహటిలో నృత్యం చేస్తున్న బిహు నృత్యకారులు. 11,304 మంది నృత్యకారులు, డ్రమ్మర్లతో ఏర్పాటుచేసిన ఈ నృత్య ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Source:Eenadu

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శంఖు ఆకారంలో నిర్మించిన ధన ధాన్య ఆడిటోరియం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం దీన్ని ప్రారంభించారు. Source:Eenadu

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని 125 అడుగుల విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వచ్చేసే అతిథులు, అభిమానుల కోసం సర్వం సిద్ధం చేశారు.

Source:Eenadu

నారాయణపేట జిల్లా జాజాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడు వెంకటేశ్‌ చిరుధాన్యాలతో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని చిత్రాన్ని వేశారు. నవధాన్యాలతో వేసిన చిత్రం ఆకట్టుకుంటోంది.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home