చిత్రం చెప్పే విశేషాలు

(14-04-23/2)

డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తున్న లోకేశ్‌ గుడిపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Source: Eenadu

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్ నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.

Source: Eenadu

యశ్‌, శ్రీనిధిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీనిధిశెట్టి ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’పై ప్రేక్షకులు చూపిన అభిమానానికి కృతజ్ఞురాలినని తెలిపారు.

Source: Eenadu

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తదితరులు పార్లమెంట్‌ హౌస్‌ ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.

Source: Eenadu

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

Source: Eenadu

సల్మాన్‌ఖాన్‌, పూజా హెగ్డే, వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోను పంచుకున్నారు. సినిమా విడుదలకు ఇంకో వారమే ఉందని పోస్టు పెట్టారు.

Source: Eenadu

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తించేలా చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఈ పోస్టర్‌ను పంచుకుంది.

Source: Eenadu

సినీనటులు అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా అలియా ఇన్‌స్టా వేదికగా ఈ ఫొటోలను పంచుకున్నారు. హ్యాపీ డే అని పోస్టు పెట్టారు. ఈ పోస్టు కింద ఫ్యాన్స్‌ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

Source: Eenadu

నూతన సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం శుక్రవారం ఇలా కనువిందు చేసింది. విగ్రహంపై పూలు చల్లేందుకు వస్తున్న హెలికాప్టర్‌ను చిత్రంలో చూడవచ్చు.

Source: Eenadu

సినీనటి ఖుష్బూ ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తన అత్తను మహేంద్రసింగ్‌ ధోనీ కలిసినట్లు తెలుపుతూ ఫొటోను పంచుకున్నారు. ధోనీ కలవడంతో ఆమెకు మరింత సంతోషం, ఆరోగ్యం దక్కాయని ఖుష్బూ చెప్పారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ‘హైలైఫ్‌ జువెల్స్‌’ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి నిత్య నరేశ్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

సినీనటి అతుల్య రవి తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఈ ఫొటోను పంచుకున్నారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన ‘మీటర్‌’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home