చిత్రం చెప్పే విశేషాలు
(15-04-2023/2)
శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ‘మనోజ్ఞ’గా ప్రేక్షకులను అలరించనుంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Source: Eenadu
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ- కూర్మన్నపాలెం వద్ద పాదయాత్రను శనివారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకునే వరకు పోరాడతామని వారు పేర్కొన్నారు.
Source: Eenadu
గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామబాణం’. మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ‘దరువెయ్ రా’ పాటను శుక్రవారం కర్నూలులో నిర్వహించిన ఈవెంట్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో డింపుల్ ఇలా మెరిశారు.
Source: Eenadu
రంగారెడ్డి జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.
Source: Eenadu
సినీనటి మాళవిక మోహనన్ ట్విటర్ వేదికగా కేరళ నూతన సంవత్సరం ‘విషు’ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుక సందర్భంగా నూతన దుస్తుల్లో మెరిసిన ఫొటోలను ఆమె ఫాలోవర్లతో పంచుకున్నారు.
Source: Eenadu
పారిస్ పర్యటనలో ఉన్న మహేశ్‌బాబు.. అక్కడ ఓ డాక్టర్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. మన ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యతను నిపుణుడికే ఇవ్వాలనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు.
Source: Eenadu
సినీనటి ఖుష్బూ మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. సీఎస్కే లవ్ అని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో సంజయ్ జోషి అనే వ్యక్తి కిలో బంగారం ధరించి.. చూపరుల దృష్టిని ఆకర్షించారు.
Source: Eenadu
వియత్నాంలోని హనోయి యూనివర్సిటీలో నిర్వహించిన టెక్ షోను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోబోతో కొద్దిసేపు ముచ్చటించారు.
Source: Eenadu
సినీనటి పూజా హెగ్డే తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘డాడీస్ వారియర్ ప్రిన్సెస్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. సల్మాన్‌ఖాన్, వెంకటేశ్‌తో కలిసి ఆమె నటించిన సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Eenadu