చిత్రం చెప్పే విశేషాలు
(17-04-2023/1)
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో పాతిన ఓ ఖాళీ స్తంభానికి కట్టేశాడు రైతు ఖాజా. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరిగిన పశువులు చల్లగుండాలని, అవి బయటికి రాకుండా ఇలా కట్టేశానన్నాడు.
Source:Eenadu
అసలే సెలవురోజు.. అందులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. ఇంకేముంది హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు నగరవాసులు క్యూకట్టారు. మహా ప్రతిమ వద్ద సెల్ఫీలు దిగారు. దీంతో ఈ దారిన ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు తప్పలేదు.
Source:Eenadu
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లెవాడ గ్రామానికి చెందిన కళ్లెం ముత్తిలింగం ఇంటి ఆవరణలో ఉన్న దొండ తీగకు కాసిన దొండకాయకు మామిడి మొక్క మెలిచింది.
Source:Eenadu
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి శివారులోని ఓ రైతు పొలంలో కనిపించిన దృశ్యమిది. సంగారెడ్డి నుంచి వికారాబాద్ జిల్లా మైతాప్‌ఖాన్ గూడెం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న పొలంలో ఈ పూలు వాహనదారులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
Source:Eenadu
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ప్రాంతాన్ని ఆదివారం నాడు సముద్రపు తేమ గాలి కమ్మేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లోనూ ఇదే పరిస్థితి. మండుతున్న ఎండల కారణంగా సందర్శకులు అధిక సంఖ్యలో తీరంలో సేదతీరారు.
Source:Eenadu
నీటి ప్రవాహాన్ని అడ్డుకునే గుర్రపుడెక్క ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల సమీపంలోని రంగనాయకస్వామి ఆలయ పరిసరాల్లో ఇలా దట్టంగా పెరిగింది.
Source:Eenadu
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్యారాధనలు నిర్వహించారు. దైవదర్శనం కోసం భక్తులు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఎండ ప్రభావంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఏర్పాటైన ఓరాఫో నగల దుకాణాన్ని ‘బలగం’ నటీనటులు కావ్య, ప్రియదర్శిలు ఆదివారం ప్రారంభించారు. షోరూంలోని పలు రకాల ఆభరణాలు ధరించిన కావ్య సందడి చేశారు.
Source:Eenadu
వికారాబాద్ జిల్లాలోని ధారుర్ సమీపంలోని రహదారిలోని ఓ పొలం వద్ద ఇప్పచెట్లు మూడురంగుల్లో మురిపిస్తున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ లెగసీ జువెలరీ స్టోర్‌ను ఆదివారం నటి శ్రీలీల ప్రారంభించారు. సరికొత్త డిజైన్ల నగలను ధరించి మురిసి పోయారు.
Source:Eenadu
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవత ఆలయం వెనుక తెల్లమద్ది చెట్టు నిండా గబ్బిలాలు ఉన్నాయి. వీటి మధ్య తేనెతుట్టెలు ఉన్నాయి.
Source:Eenadu