చిత్రం చెప్పే విశేషాలు

(17-04-23/2)

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ సంయుక్త ఇలా మెరిశారు.

Source: Eenadu

ఎం.ఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో క్రికెటర్‌ ‘ముత్తయ్య మురళీధరన్‌’ బయోపిక్‌ తెరకెక్కుతోంది. మధుమిట్టల్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Source: Eenadu

విక్రమ్‌ కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తంగలాన్'. మాళవిక మోహనన్‌ కథానాయిక. హీరో విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్‌ విజువల్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలపుతున్నారు.

Source: Eenadu

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం హయత్ నగర్ ఫైర్ సిబ్బంది ఎల్బీనగర్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచారు.

Source: Eenadu

మంత్రి కేటీఆర్‌ తన చిన్ననాటి ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తన బాల్యంలో హెయిర్‌స్టైల్‌ ఇలా ఉండేదని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమాలో విక్రమ్‌ప్రభు... ‘పార్తీపేంద్ర పల్లవ’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

భారతదేశంలో మొట్టమొదటి యాపిల్‌ స్టోర్‌ను మంగళవారం ముంబయిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ ప్రివ్యూలో యాపిల్‌ గ్యాడ్జెట్స్‌ను ప్రదర్శించారు. ఉద్యోగులు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.

Source: Eenadu

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం కింద రూ.36లక్షలతో అభివృద్ధి చేసిన మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు స్వాగతం పలికారు. 

Source: Eenadu

దక్షిణ ఫ్రాన్స్‌లోని సెర్బరె సమీపంలో కార్చిచ్చు సంభవించింది. దీంతో వందలాది మంది అగ్నిమాపక దళ సభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వాటర్‌ బాంబర్‌ ప్లేన్‌ సహాయంతో రసాయనాన్ని చల్లుతూ కనిపించారు.

Source: Eenadu

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న రాహుల్‌గాంధీ మార్గమధ్యలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home