చిత్రం చెప్పే విశేషాలు

(19-04-2023/1)

కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవం రామప్ప వేదికగా ప్రపంచ వారసత్వ దినోత్సవం కనులపండువగా సాగింది. పేరిణి నృత్య కళాకారులు మనసు దోచారు. మంగళవారం శిల్పం.. వర్ణం.. కృష్ణం పేరిట నిర్వహించిన ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి.

Source:Eenadu

సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షురావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేయగా.. మంగళవారం గ్రాడ్యుయేషన్‌ పట్టా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం కేసీఆర్‌, శోభ దంపతులు, మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, సోదరి అలేఖ్య హాజరయ్యారు.

Source:Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని పాత దిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో మంగళవారం పర్యటించారు. వ్యాపారులతో ముచ్చటించి ఆహార పదార్థాలను రుచి చూశారు.

Source:Eenadu

చారిత్రక మక్కా మసీదులో మంగళవారం రాత్రి రంజాన్‌ మాసం 26వ రోజున సంప్రదాయ షబ్‌-ఏ-ఖదర్‌ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్‌ సమీపంలోని రంజాన్‌ రాత్‌బజార్‌లో షాపింగ్‌కు వచ్చిన ముస్లింలు రాత్రి జాగరణ పాటించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Source:Eenadu

వేసవిలో చిన్న చిన్న మొక్కలకు, లాన్‌లో పెంచే గడ్డికి ఒక్కరోజు నీరు పోయకపోయినా మరునాటికి వాడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో పచ్చదనం తగ్గకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇతర కాలాల్లోలాగే వేసవిలోనూ పచ్చదనంతో కనువిందు కలిగిస్తున్నాయి.

Source:Eenadu

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనంపై విద్యార్థిని పుస్తకం చదువుతున్నట్లుగా వేసిన భారీ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. చదువుకోవాలనే ఆలోచన రేకెత్తిస్తోంది.

Source:Eenadu

ఈ కూరగాయల కొనుగోలు సందడంతా కొంగరకలాన్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని కూరగాయల విక్రయ కేంద్రంలోనిది. అధికారుల అనుమతితో రైతులు దీనిని ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో తాజావి అందుబాటులో ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు.

Source:Eenadu

ఉప్పల్‌ స్టేడియం వద్ద మంగళవారం ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. క్రీడాకారులు వస్తున్న బస్సు వద్ద ఫొటోలు తీసుకుని సంబరపడ్డారు.

Source:Eenadu

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారుం పారిశ్రామిక వాడలో ఓ మహిళా పారిశ్రామికవేత్త నెలకొల్పిన పరిశ్రమను మంగళవారం సినీ నటి కీర్తి సురేశ్‌ ప్రారంభించారు. అభిమానులు కీర్తిని చూసి మురిసిపోయారు.

Source:Eenadu

వృథా టైర్లే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఆధారం అవుతున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి శివారులో ఓ రైతు తన చేనులో అమర్చిన పోల్‌లకు కొంత ఎత్తులో ఇలా టైర్లను డ్రాగన్‌ ఫ్రూట్‌కు హాని కలగకుండా, మచ్చలు పడకుండా అమర్చారు.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home