చిత్రం చెప్పే విశేషాలు

(19-04-2023/2)

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో 2019లో తెరకెక్కిన సినిమా ‘జెర్సీ’. ఈ సినిమా విడుదలై 4ఏళ్లు పూర్తైన సందర్భంగా నాని ట్విటర్‌ వేదికగా జెర్సీ సినిమాలోని ఓ ఫొటోను పోస్టు చేశారు.

Source: Eenadu

నితిన్‌, నిత్యా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌ ట్విటర్‌ వేదికగా ‘గుండెజారి గల్లంతయ్యిందే విడుదలై పదేళ్లైనా నిన్న విడుదలైనట్టే అభిమానులు ఆదరిస్తున్నారు.’ అంటూ రాసుకొచ్చారు.

Source: Eenadu

 సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా సంతోష్‌ కట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమ విమానం’ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.

Source: Eenadu

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ‘ఓజీ’ మెదటి షెడ్యూల్‌ షూటింగ్ ముంబయిలో సాగుతోంది.

Source: Eenadu

‘స్పైడర్‌మ్యాన్‌’గా పేరు సంపాదించిన ఫ్రెంచ్‌ అర్బన్‌ క్లైంబర్‌ అలైన్‌ రాబర్ట్‌ బుధవారం పారిస్‌లోని ఆల్టో టవర్‌ను అవలీలగా ఎక్కి సంబరాలు చేసుకున్నాడు.

Source: Eenadu

ఈ ఫొటోలో కనిపిస్తోంది ట్రినిటీ అనే పేరు గల టైరనోసారస్‌ రెక్స్‌ జాతి డైనోసర్‌ పుర్రె. దీన్ని స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో వేలానికి ఉంచారు. ఈ పుర్రె వేలంలో 5.6 నుంచి 8.9 మిలియన్‌ డాలర్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

Source: Eenadu

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఈ సిరీస్‌ ప్రీమియర్‌ను మంగళవారం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రియాంక, నిక్‌ జోనాస్‌ దంపతులు పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

న్యూయార్క్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో పార్కింగ్‌ గ్యారేజ్‌ కూలిపోవడంతో కార్లు ఇలా ఒకదానిపై ఒకటి పడిపోయాయి.

Source: Eenadu

సినీ దర్శకుడు హను రాఘవపూడి పుట్టిన రోజు సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ట్విటర్‌ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ హ్యాపీ బర్త్‌డే హనూ డియర్‌’ అని విష్‌ చేశారు.

Source: Eenadu

సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసిన ఆయన.. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ’ అంటూ రాసుకొచ్చారు

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home