చిత్రం చెప్పే విశేషాలు
(20-04-2023/2)
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. మే 18న థియేటర్లలో విడుదల కానుంది. చిత్రబృందం గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది.
Source: Eenadu
విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొచ్చి వెళ్లిన చిత్రబృందం ఇలా సెల్ఫీ తీసుకుంటూ సందడి చేసింది.
Source: Eenadu
నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ పెద పెండేకల్ శివారు ఎర్రచెరువు వంకలో ఉపాధి హామీ కూలీలను కలిశారు. గునపంతో మట్టి తవ్వి కూలీలతో కలిసి పనిచేశారు.
Source: Eenadu
దిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన యాపిల్ సాకేత్ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ స్వయంగా కస్టమర్లకు స్వాగతం పలికారు. యాపిల్ గ్యాడ్జెట్స్ పనితీరుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
Source: Eenadu
తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చెల్లూరు- గొట్లాం బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు చెప్పారు. ఈ బైపాస్ రోడ్డు వద్ద ఆయన ఇలా సెల్ఫీ తీసుకొని వైకాపా ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.
Source: Eenadu
దిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. బౌద్ధ సన్యాసులను సత్కరించారు.
Source: Eenadu
నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్, బ్లడ్ బ్యాంకు కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగుల కోసం కొత్త బెడ్‌లను ఏర్పాటు చేసి బెలూన్లతో సుందరీకరించారు.
Source: Eenadu
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ(ఐఐఏఎస్) కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి వసతులను ఆమె పరిశీలించి ఫొటోలు దిగారు.
Source: Eenadu
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి వేడుకలు చేసుకున్నారు. అక్కడికి వచ్చిన ప్రజలకు స్వయంగా మిఠాయిలు, భోజనం వడ్డించారు.
Source: Eenadu
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ(వర్కింగ్ టైటిల్)’.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. షూటింగ్ సెట్‌లో పవన్ ఇలా స్టైల్‌గా ఫోన్ మాట్లాడుతున్న ఫొటోను చిత్రబృందం పంచుకుంది.
Source: Eenadu