చిత్రం చెప్పే విశేషాలు
(21-04-2023/2)
గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. మే 5న విడుదల కానుంది. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి ఇలా మెరిశారు.
source: Eenadu
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ‘టాలెంట్ హంట్- 2023’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఓ బాలిక షూటింగ్ నేర్చుకుంటుండగా దగ్గరుండి పరిశీలించారు. టాలెంట్ హంట్‌లో భాగంగా అండర్-17 పారా అథ్లెట్లకు శిక్షణనిస్తున్నారు.
source: Eenadu
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాలో రుహానీ శర్మ.. ‘డాక్టర్ రేణు’ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను పంచుకుంది. డిసెంబర్ 22న ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
source: Eenadu
రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
source: Eenadu
యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన ముగించుకొని బయలుదేరారు. ఈ సందర్భంగా యాపిల్ ఉద్యోగులతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వారం రోజులు భారత్‌లో గొప్పగా గడిచిందని తెలుపుతూ ఆయన పోస్టు పెట్టారు.
source: Eenadu
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన బ్యాట్లు, ప్యాడ్‌లు, గ్లౌస్ ఇతర క్రీడా సామగ్రి ఈ నెల 15న బెంగళూరులో చోరీకి గురైంది. ఇందుకు సంబంధించిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుపుతూ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫొటోను పంచుకున్నారు.
source: Eenadu
దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టింది. ఈ సందర్భంగా డీసీ జట్టు సభ్యులు మ్యాచ్ అనంతరం కేకు కోసి వేడుకలు చేసుకున్నారు.
source: Eenadu
ట్విటర్ తమ నిబంధనల్లో భాగంగా ఛార్జీలు చెల్లించని వారికి బ్లూటిక్‌ను తొలగించింది. ఈ నేపథ్యంలో బ్లూటిక్‌ను కోల్పోయిన సచిన్ తెందూల్కర్ ట్విటర్ వేదికగా తన తాజా ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతానికి ఇదే తన బ్లూటిక్ వెరిఫికేషన్ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
source: Eenadu
హవాయియన్ మాంక్ సీల్ కైవీ, దానికి పుట్టిన పిల్ల సీల్ ఇలా హొనోలులులోని వైకికీ కైమనా బీచ్‌లో కనిపించాయి. అంతరించిపోతున్న ఈ జీవుల్ని సంరక్షించేందుకు ఇక్కడ పర్యాటకుల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. సాధారణంగా ఈ బీచ్‌కు ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
source: Eenadu
త్రిష తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. త్రిష నటించిన ‘పొన్నియిన్ సెల్వన్2’ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
source: Eenadu