చిత్రం చెప్పే విశేషాలు

(22-04-2023/1)

పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇరాన్‌కు చెందిన అఫ్షాన్‌ గదేర్‌జాదే తాజాగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు.ఆయన వయసు 20 ఏళ్లు. అతడి ఎడమ చేయి 6.7 సెంటీమీటర్లు, కుడి చేయి 6.4 సెంటీమీటర్ల మేర పొడవును కలిగి ఉన్నారు.

Source:Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలో ఓ చెట్టు రెండు రంగుల్లో కనువిందు చేస్తోంది. హస్నాపూర్‌ సమీపంలో ఉన్న ఇప్ప చెట్టు కాండం ఒక్కటే గానీ రెండు రంగుల్లో కుంకుమ, ఆకుపచ్చగా చిగురిస్తోంది. ఆ వైపుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

Source:Eenadu

శ్రీకృష్ణానగర్‌లోని శ్రీసాయి సరస్వతీ విద్యానికేతన్‌లో శుక్రవారం రంజాన్‌ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఇలా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

Source:Eenadu

జిల్లా కోర్టుల్లో టైపిస్ట్, కాపియిస్ట్‌ ఉద్యోగాలకు ఎంపికలో భాగంగా శుక్రవారం ఉదయం అభ్యర్థులకు షీలానగర్‌ ఐయాన్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. కొన్ని కంప్యూటర్ల వద్ద కీ బోర్డులు పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అభ్యర్థులు కేంద్రం ఎదుట ఆందోళన చేశారు.

Source:Eenadu

స్కాట్లాండ్‌లోనినార్త్‌ బెర్విక్‌ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చినభారీ తిమింగల కళేబరం

Source:Eenadu

హెచ్‌ఐసీసీలో శుక్రవారం పలువురు ముద్దుగుమ్మలు సందడి చేశారు. సినీనటి రాశీసింగ్, శుభశ్రీ రాయగురు, సోనుఠాకూర్‌తో పాటు పలువురు మోడళ్లు సరికొత్త డిజైన్‌ వస్త్రాలు ధరించి హోయలుపోయారు.

Source:Eenadu

రంజాన్‌కు చార్మినార్‌ పరిసర ప్రాంతంలో గాజులు కొనుగోలు చేస్తున్న మహిళలు..

Source:Eenadu

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ ధాన్యరాశులతో కళకళలాడుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు శుక్రవారం 45,253 బస్తాల(29,416 క్వింటాళ్ల) ధాన్యం తీసుకొచ్చి వ్యవసాయ మార్కెట్‌లో రాశులుగా పోశారు. దీంతో మార్కెట్‌లో ఎటూ చూసినా వడ్ల కుప్పలే కనిపించాయి.

Source:Eenadu

వరంగల్‌ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో శుక్రవారం రాత్రి 50వ వార్షికోత్సవం జరిగింది. విద్యార్థినీ, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Source:Eenadu

అధ్వాన రహదారులతో ఆర్టీసీ బస్సులు రహదారుల్లోని లోతైన గుంతల్లో పడి తరచూ కిటికీల అద్దాలు పగిలిపోతున్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోకు చెందిన ఓ బస్సు అద్దాలు లేకుండానే ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్న దృశ్యమిది.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home