చిత్రం చెప్పే విశేషాలు

(22-05-2023/2)

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. వాషింగ్టన్‌లో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.

Source : Eenadu

ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్‌ మెరిశారు. ఆమె పదునైన చూపులతో చూపరులను ఆకట్టుకున్నారు.

Source : Eenadu

ప్రధాని నరేంద్ర మోదీకి న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఆ దేశ క్రికెట్‌ జెర్సీని బహూకరించారు. పపువా న్యూ గినియాలో ఈ నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

Source : Eenadu

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్రంలో ‘కీసర ప్రీమియర్ లీగ్’ క్రికెట్ పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి పార్టీ శ్రేణులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

Source : Eenadu

శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సుకు సినీనటుడు రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు.

Source : Eenadu

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, కోచ్‌లు కలిసి దిగిన ఫొటోను ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source : Eenadu

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడివారు మంత్రితో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటో తీసుకొని సంబరపడ్డారు.

Source : Eenadu

శ్రీనగర్‌లో సోమవారం జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జీ20 ప్రతినిధులకు శ్రీనగర్‌ విమానాశ్రయంలో మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

Source : Eenadu

ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సినీ నటి మౌని రాయ్‌ పాల్గొని సందడి చేశారు.

Source : Eenadu

ముంబయి అచీవర్స్‌ అవార్డ్స్‌ 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీనటి షెర్లీ సేథియా ‘ది రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్నారు.

Source : Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(23-05-2024/1)

సయీ.. డ్యాన్స్‌కి సై

రీక్రియేట్‌లోనూ ఎంత బాగుందో..

Eenadu.net Home