చిత్రం చెప్పే విశేషాలు

(24-05-2023/2)

గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్యాలిఫయర్‌ మ్యాచ్‌లో గెలిచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకొని ‘సూపర్‌ ఫ్యామిలీ’ అంటూ జట్టు సభ్యులకు అభినందనలు తెలిపింది.

Source: Eenadu

జేసన్‌ హోల్డర్‌తో యుజ్వేంద్ర చాహల్‌ కలిసి దిగిన ఫొటోను రాజస్థాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. జేసన్ హోల్డర్‌తో ఫొటో తీసుకునే విధానాన్ని తెలిపే బెగినర్స్‌ గైడ్‌ ఇది అని ఫన్నీగా పోస్టు పెట్టింది. 

Source: Eenadu

ఝార్ఖండ్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అక్కడి డియోఘర్‌లోని బాబా వైద్యనాథ్‌ ధామ్‌ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

‘బలగం’ సినిమా దర్శకుడు వేణు.. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కోసం సమయం కేటాయించినందుకు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి శాన్వీమేఘన పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్‌ మేళా-2023’ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన విత్తనాలు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు.

Source: Eenadu

సిడ్నీలోని ఒపెరా హౌస్‌, సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి వద్ద ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఒపెరా హౌస్‌, సిడ్నీ హర్బర్‌ బ్రిడ్జిపై భారతదేశ జాతీయ జెండా రంగులను ప్రదర్శించడాన్ని చిత్రంలో చూడొచ్చు.

Source: Eenadu

సినీనటి కంగనా రనౌత్‌ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న ఆమె.. శివుడిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, హర హర మహదేవ్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ముగింపు సందర్భంగా నేడు తీసుకున్న ఫొటోను రామ్‌చరణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home