చిత్రం చెప్పే విశేషాలు

(25-05-2023/2)

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

Source: Eenadu

తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్‌తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.

Source: Eenadu

ఆకాశ్ మధ్వాల్‌ బుధవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 5పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, మధ్వాల్‌ కలిసి ఉన్న ఈ ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

Source: Eenadu

ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదితిరావు హైదరీ మెరిశారు.

Source: Eenadu

జడ్చర్లలో నేడు నిర్వహించనున్న సభ కోసం హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు స్వాగతం పలికారు.

Source: Eenadu

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, మ‌హాసంప్రోక్ష‌ణ చేపట్టారు.

Source: Eenadu

నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలు ఆయనతో సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. లోకేశ్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Source: Eenadu

ఝార్ఖండ్‌లోని ఖుంతిలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె.. అక్కడి చిన్నారులను ముద్దు చేయడంతో పాటు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.

Source: Eenadu

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.

Source: Eenadu

చెన్నై జట్టు ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యుడు బ్రావో.. ఆటగాడు మతీశా పతిరాణ ఇలా సంబరపడుతున్న ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ మమ్మల్ని ముందుకు నెట్టండి.. ఛాంపియన్‌’ అని ట్వీట్‌ చేసింది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(28-05-2023/2)

కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలివీ...!

చిత్రం చెప్పే విశేషాలు..!(28-05-2023/1)

Eenadu.net Home