చిత్రం చెప్పే విశేషాలు

(28-05-2023/2)

తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొని తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఆదివారం స్వామివారు సింహ వాహనంపై అనంత స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.

అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం వారు గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.

దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా) ప్రదానోత్సవంలో సినీనటి రాశీఖన్నా మెరిశారు.

వేసవి సెలవులు, వారాంతం కావడంతో ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో స్వామి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.

బెర్లిన్‌లో కార్నివాల్‌ ఆఫ్‌ కల్చర్స్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ‘గ్రూపో చిలీ’ అనే నాట్య బృందంలోని ఓ నర్తకి ఇలా విభిన్న వేషధారణలో నృత్యం చేస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం.

పార్లమెంట్‌ నూతన భవనం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.

విశాఖపట్నంలోని వివిధ కళాశాలల్లో ఆదివారం సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష అనంతరం ఓ కళాశాల ముందు అభ్యర్థిని ఇలా నవ్వుతూ కనిపించింది.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున మంచి ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్‌ తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

రాఘవ లారెన్స్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. నటి రాధిక శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను రాధిక తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

అణువణువూ అలలెగసే...

చూడకండి సిగ్గేస్తుంది

చూపు తిప్పుకోలేకపోతున్నాం

Eenadu.net Home