చిత్రం చెప్పే విశేషాలు

(10-06-2023/2)

వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సరితా పాండే అనే మహిళ కలిశారు. ఈ సందర్భంగా చార్‌కోల్‌పై వాటర్‌ కలర్‌తో సోనియాగాంధీ చిత్రాన్ని వేసిన పెయింటింగ్‌ను ఆ మహిళ రాహుల్‌ గాంధీకి బహుమతిగా ఇచ్చారు. 

నటులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం త్వరలో జరగనుంది. శుక్రవారం సాయంత్రం వీరి నిశ్చితార్థం వేడుకగా నిర్వహించారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను వరుణ్‌ తేజ్‌ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జంగాలపల్లెలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పెన్నానదిని తోడేసి వైకాపా నాయకులు అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డుతో లోకేశ్‌ ఇలా సెల్ఫీ దిగారు.

 పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ(వర్కింగ్ టైటిల్‌)’. ఈ సినిమాలో నటుడు అర్జున్‌దాస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్రబృందం ట్వీటర్‌లో పంచుకుంది.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కథానాయకుడు శర్వానంద్, రక్షితల వివాహ రిసెప్షన్‌ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్‌బీకే 109) రానుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

 నాని, నజ్రియా జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమా 2022లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రానికి సంవత్సరం పూర్తయిందని తెలుపుతూ నాని తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. 

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్‌బీకే109) రానుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూట్‌ను ప్రారంభించారు. మొదటి సీన్‌కు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు.

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’నుంచి త్వరలో అతిపెద్ద ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌ ఫొటోను ఆహా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ కోసం వేచి ఉండండి’ అని ట్వీట్‌ చేసింది.

మలైకా.. అదిరింది యోగా!

చిత్రం చెప్పే విశేషాలు(26-04-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

Eenadu.net Home