చిత్రం చెప్పే విశేషాలు..

(15-09-2023/2)

తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయితీ పరిధిలో పాలకనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు కావడంతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చిభక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని పంచాయతీ రాజ్‌ కార్యాలయంలో శుక్రవారం ఇంజినీర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి ఆవిష్కరించారు.

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు రూ.91 లక్షలు విలువ చేసే మూడే అంబులెన్సులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విరాళంగా ఇచ్చింది. శ్రీవారి ఆలయం ఎదుట అమరావతి సర్కిల్‌ జీఎం నవీన్‌ చంద్రజా అంబులెన్స్ తాళాలను తితిదే ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.

శుక్రవారం నుంచి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాచవరం ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో పరీక్ష రాసి బయటకు వస్తున్న యువత

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అమీర్‌పేటలోని కాసాని ఇంటికి వెళ్లి దత్తాత్రేయ పరామర్శించారు.

డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు ఊడ్చిపెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో మృతదేహాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ ఈరోజు ప్రారంభమైంది. 2,052 పరీక్ష కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,78,055 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. ఈ నెల 27న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.

చిత్రం చెప్పే విశేషాలు.. (28-09-2023/1)

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు..

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2023/2)

Eenadu.net Home