చిత్రం చెప్పే విశేషాలు..

(16-09-2023/2)

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇక్ఫయ్‌(ICFAI) కళాశాల 13వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఫొటోలకు పోజులిస్తూ సంబరాల్లో మునిగి తేలారు.

సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో వారిని ఆహ్వానించారు. 

దసరా, వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మోడల్స్‌ నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దెందులూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న తెదేపా నాయకులు

 సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) అవార్డు అందుకున్నారు.

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

చంద్రబాబు అక్రమ అరెస్టుపై సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చించాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోవాలని పిలుపు 

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించారు. ఉత్తమ నటిగా శ్రీలీల (ధమాకా) అవార్డు అందుకున్నారు.

చిత్రం చెప్పే విశేషాలు.. (28-09-2023/1)

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు..

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2023/2)

Eenadu.net Home