చిత్రం చెప్పే విశేషాలు..

(18-09-2023/2)

అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ రాతిగుడి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇండియన్‌ యూత్‌ స్టార్స్‌ ఆధ్వర్యంలో 38వ వార్షికోత్సవ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడ గణేశుడు కసాపురం శ్రీ నెటికంటి ఆంజనేయస్వామి రూపంలో పూజలు అందుకుంటున్న దృశ్యం..

దిల్లీలో ఆదివారం మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఓ చిన్నారికి చాక్లెట్‌ ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వినాయకుడికి పూజలు.

చవితి సందర్భంగా సోమవారం లంబోదరుడికి ఆహ్వానం పలికేందుకు నగరవాసులు వీధివీధినా మండపాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల తరలింపు, పూజాసామగ్రి కొనుగోళ్లతో ఆదివారం నగరమంతా సందడి వాతావరణం కనిపించింది.

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెదేపా ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. 

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం అరుణ వర్ణంలో మెరిసింది. సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగసభ నిర్వహించారు.

వినాయక చవితి సందర్భంగా రాజమహేంద్రవరంలోని నాళం భీమరాజు వీధిలో వినాయకుడి ఆలయంలో నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యుల పూజలు నిర్వహించారు. 

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలైంది. ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా దర్శనమిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తిని నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home