చిత్రం చెప్పే విశేషాలు..

(19-09-2023/2)

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని ద్వారకా శ్రీకృష్ణుడి అలంకరణలో చిన్న శేష వాహనంపై ఊరేగించారు. కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా చిత్తూరు జిల్లా కుప్పంలోని చెక్కునత్తం గ్రామానికి చెందిన యువకుడు ఎన్. గణపతి. కుప్పం నుంచి దాదాపు 800 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకొన్నాడు.

ఆదిలాబాద్‌ రిమ్స్ ఆసుపత్రి పక్కన గల వినాయక ఆలయంలో మంగళవారం 108 వేద కలశాలతో మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పలువురు దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి గత 40 రోజులకు హుండీ ఆదాయాన్ని ఈవో ఆజాద్ పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. నగదు రూ. 1.99 కోట్లు, చిల్లర నాణేలు రూ. 7.76 లక్షలుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు విదేశీ కరెన్సీతో మొత్తం రూ. 2.07 కోట్లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. 

రాజమండ్రిలో నారా భువనేశ్వరిని పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ. చంద్రబాబుపై నిరాధార అరెస్టు నిలబడదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా చంద్రబాబు ప్రతిభను గుర్తించి మద్దతు ఆమె తెలిపారు. 

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ దీక్ష 23 రోజుల నుంచి కొనసాగిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. తమ డిమాండ్లు తీర్చేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని వెల్లడించారు.

చంద్రబాబును విడుదల చేయాలంటూ కరక చెట్టు పోలమాంబ ఆలయం వద్ద మహిళలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి 12వ క్రస్ట్ గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని డెల్టాకు విడుదల చేసిన ప్రాజెక్ట్ అధికారులు

చిత్రం చెప్పే విశేషాలు.. (28-09-2023/1)

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు..

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2023/2)

Eenadu.net Home