చిత్రం చెప్పే విశేషాలు..
(23-09-2023/2)
ఫ్యాక్షన్ మూలాలున్న వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు పరిటాల సునీత అన్నారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధలు పడుతున్నారు.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువత, రైతులు, ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో ఓ మహిళా డిగ్రీ కళాశాల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. బర్కత్‌పుర హైందవీ కళాశాల ఆధ్వర్యంలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. భక్తులు, విద్యార్థులు సందడి చేశారు.
సికింద్రాబాద్ మౌలాలిలోని ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో ఆర్పీఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా పరేడ్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాంజలి ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఓ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు లబ్బిపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాంజలి కంచి, ఆరణి, బెనారస్ డిజైనర్ పట్టు చీరలు ధరించి విద్యార్థినులు ర్యాంప్‌పై హోయలొలికించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. శనివారం సాయంత్రం 4గంటల నుంచి స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు అభయప్రదానం చేస్తారు.
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చంద్రముఖి-2’. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరులో 11వ రోజు నాయీ బ్రాహ్మణ సోదరుల వాయిద్యాలతో నిరసన చేపట్టారు.