చిత్రం చెప్పే విశేషాలు

(24-09-2023/1)

మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన గణపతి విగ్రహం కూర్చొని ఉంటోంది. భక్తులు దగ్గరికి రాగానే వారి తలపై చేతులతో దీవిస్తోంది. ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.


 రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ 39వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని మౌలాలి శిక్షణ కేంద్రంలో శనివారం జరిగింది. ఈ దినోత్సవాల్లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

గత జులైలో కొత్తగూడెంలో గాలివానకు సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద, బంగ్లోస్‌ షటిల్‌ కోర్టు సమీపంలో భారీ వృక్షాలు కూలాయి. ఖర్చుకు వెనుకాడకుండా రెండు వృక్షాలను క్రేన్‌ సాయంతో ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని బంగ్లోస్‌లో ఓ చోట నాటించారు. ఇప్పుడా మోడులు చిగుళ్లు వేశాయి. 

కటక్‌లోని నువాపడ ప్రాంతంలో వినాయకుని పూజల సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్‌ ఆకట్టుకుంటోంది. ప్రెస్‌ కాలనీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని సియాచిన్‌ సరిహద్దు ప్రాంతంలో జవానులు దేశాన్ని కాపలా కాస్తున్న దృశ్యాలతో తీర్చిదిద్దారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

హైదరాబాద్లోని ఎల్బీనగర్‌ కూడలిలో వంతెన పనులు జరుగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను అలాగే వదిలేశారు. దీంతో పాదచారులకు అవి ప్రమాదకరంగా మారాయి.

వినాయక నిమజ్జనం కోసం గుర్రాల బొమ్మలతో ఏర్పాటు చేసిన వాహనాలకు గిరాకీ పెరిగింది. వీటిపై గణనాథుడిని ఊరేగించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి జాతీయ రహదారిలో ఇలా వరుసగా అందుబాటులో ఉంచారు. 

ఆదిలాబాద్‌ పట్టణంలోని డైట్‌ కళాశాల రహదారి బురదమయంగా మారింది. ఇదే మార్గం గుండా పలు కాలనీలకు విద్యార్థులతోపాటు కాలనీవాసులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ దారిలో బురద కారణంగా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

విద్యార్థినులు వేదికపై హొయలు పోయారు.. సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సాన్వి డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు(10-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(10-05-2025)

Eenadu.net Home