చిత్రం చెప్పే విశేషాలు..

(25-09-2023/3)

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెదేపా నేతలు మౌన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలంటూ తెదేపా నేతలు నినాదాలు చేశారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు సోమవారం మహారథంపై కొలువుదీరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. మాడవీధుల్లో వైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా , ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం రావడంతో పెళ్లి మండపం కళకళలాడింది. ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో పరిణీతి చోప్రా పోస్టు చేసింది. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ 13వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేయాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. 

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో వెంకటాపురం మండలంలోని ముత్తారం జలపాతం కనువిందు చేస్తోంది.

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆదివారం చంద్రముఖి-2 చిత్ర బృందం విచ్చేసింది. చిత్ర దర్శకుడు పి.వాసుతోపాటు నటి కంగనా రనౌత్, నటుడు రాఘవ లారెన్స్, నటి మహిమ నంబియార్‌కు ఆలయంలో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల మనిషి అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని చెప్పారు. ఏం తప్పు చేశారని 17 రోజులుగా ఆయన్ను జైల్లో నిర్బంధించారని ప్రశ్నించారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు(10-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(10-05-2025)

Eenadu.net Home