చిత్రం చెప్పే విశేషాలు..
(26-09-2023/2)
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎన్టీఆర్ మార్గ్‌లో విభాగినిని పూర్తిగా మూసివేశారు. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు వంతెన మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వంతెన వద్ద వరద నీరు ఇలా నిలవడంతో సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల ఈ భేటీలో పాల్గొన్నారు. ఆధారాలు లేకున్నా అవినీతి బురదజల్లే లక్ష్యంతో అరెస్టు చేశారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని లోకేశ్ కోరారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి కనులపండుగగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతిని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా శ్రీకాంత్ నగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’ (Month Of Madhu). శ్రేయా నవిలే, మంజుల, హర్ష తదితరులు నటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక జరిగింది.
ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గ్రామంలో రైలుగేటు వద్ద పొగాకు పంటకోసం విత్తనాలు వేశారు. ఈ మొక్కలకు తేమ కోసం గడ్డికి బదులుగా వంద చీరలను ఇలా పరిచారు. దీంతో అక్కడి ప్రాంతం రంగు రంగులతో కనిపిస్తుంది.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఫ్రాన్స్‌లో తెదేపా నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘I am With CBN’ అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లోని బంజారహిల్స్‌లో ‘మిసెస్ ఇండియా తెలంగాణ’ ఫ్యాషన్ షో నిర్వహించారు. విజేతను మంగళవారం తాజ్ డెక్కన్ హోటల్‌లో సన్మానించారు.