చిత్రం చెప్పే విశేషాలు..

(30-09-2023/3)

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు‌‌‌. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుంది

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. గుబ్బగుర్తిలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో గోద్రెజ్‌ సంస్థ సహకారంతో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న పలువురు నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను నేతలు ప్రకటించనున్నారు. నారా లోకేశ్‌ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొననున్నారు.

కూకట్‌పల్లిలోని అశోక వన్‌మాల్‌ వద్ద ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 5కే వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డీజే టిల్లు చిత్రంలోని పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు.

‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (World Culture Festival 2023) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’, ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల’ వ్యవస్థాపకులు గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రసంగించారు.

కేపీహెచ్‌బీలోని నెక్సస్‌ మాల్‌లో ఓ షోరూం ప్రారంభోత్సవంలో నటుడు మహేశ్‌ బాబు సతీమణి నమ్రత, కూతురు సితార సందడి చేశారు. వృద్ధులు, చిన్నారులకు బహుమతులు పంచి అభివాదం చేశారు.

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి చెందిన తెలుగు యువత నాయకులు శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణిని కలిశారు. అంతకు ముందు లోవ తలుపులమ్మ తల్లిని దర్శించుకున్న చంద్రబాబుకు మంచి జరగాలని ప్రార్థనలు చేసి.. ఆలయం ప్రసాదాన్ని బ్రాహ్మణికి అందజేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home