చిత్రం చెప్పే విశేషాలు

(07-10-2023/2)

మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది.  

లైట్లు అన్ని ఆపేశారు. చిమ్మ చీకటి.. ఒకే సారి 450 డ్రోన్లు ఆకాశంలోకి లేచాయి. అంతే ఆకట్టుకునే రీతిలో పలు ఆకృతులను ప్రదర్శించాయి. 20 నిముషాల పాటు ఖమ్మం ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ పార్కులో శుక్రవారం డ్రోన్లతో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. 

ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌కూ ప్రేక్షకులు కరవయ్యారు. అహ్మదాబాద్‌ మాదిరిగానే హైదరాబాద్‌లోనూ ప్రపంచకప్‌ పోరు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 39000 సామర్థ్యమున్న ఉప్పల్‌ స్టేడియంలో గరిష్టంగా 9000 వేల మంది మ్యాచ్‌కు హాజరయ్యారు.

విశ్వనగరంగా అడుగులేస్తున్న హైదరాబాద్‌లో కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. మణికొండ ప్రాంతంలోని అల్కాపురి కూడలిలో చెట్టు ఆకృతిపై ఏర్పాటు చేసిన సీతాకోక చిలుకలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

మన్యంలో చలి వాతావరణం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు మన్యంవ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంది. ఈ వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు తరలివస్తున్నారు. పాడేరు ఘాట్‌రోడ్లో మంచు అందాలు కనువిందు చేశాయి. 

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో బాలీవుడ్‌ హీరో అనిల్‌కపూర్‌ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. 

జూ పార్కులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెల్ల పులి పిల్లలకు శుక్రవారం నామకరణం చేశారు. జూబ్లీ వేడుకల్లో పర్యాటకులు పాల్గొని సందడి చేశారు. 

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం పల్సి(కె) గ్రామ శివారులో పచ్చదనంతో పర్యటకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. మార్చిలో తీవ్రమైన ఎండల కారణంగా పచ్చని చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా ఉంది. ప్రకృతి ప్రేమికులు మాత్రం రెండు కాలాల్లోనూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

రంగధాముని చెరువు కట్టను ఆధునికీకరించి లేక్‌ ఫ్రంట్‌ పార్క్‌ నిర్మించారు. గురువారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లోపల పచ్చదనంతోపాటు కూర్చోవడానికి ఆధునిక ఏర్పాట్లు, సెల్ఫీ స్పాట్‌ ఉన్నాయి.

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(04-12-2023/3)

చిత్రం చెప్పే విశేషాలు (04-12-2023/2)

Eenadu.net Home