చిత్రం చెప్పే విశేషాలు

(08-10-2023/1)

వివిధ రాష్ట్రాల్లో 90 వేల స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసి ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో 3డీ సెల్ఫీపాయింట్లను ఏర్పాటు చేస్తోంది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ చిత్రం గల 3డీ పాయింటును శనివారం రాత్రి ఏర్పాటు చేశారు.

క్రికెట్‌ ప్రపంచ కప్‌ ప్రచారంలో భాగంగా నగరంలో పలు కూడళ్లలో ఆటపై ప్రశ్నలు, చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి నగరంలో జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అందిస్తున్నారు. షేక్‌పేట ఓయూ కాలనీ కూడలిలో శనివారం కనిపించిందీ చిత్రం. 

అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు రూ.వంద కోట్ల ఖర్చుతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ సైకిల్‌ ట్రాక్‌పైకి గుంపుగా బర్రెలు రావడం చర్చనీయాంశమైంది. నార్సింగి వద్ద వెహికల్‌ అండర్‌ పాస్‌ నుంచి కొన్ని బర్రెలు గుంపులుగా సైకిల్‌ ట్రాక్‌లోకి ప్రవేశించి కొంత దూరం వెళ్లాయి. 

మెదక్‌ పట్టణాన్ని శనివారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 7.30 గంటల వరకు పట్టణాన్ని మంచు వదలకపోవడంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ముందుకు సాగారు.

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద సర్వీసు రోడ్డుపై కార్లు వరుసగా నిలిపినా పట్టించుకోకుండా ఓ పక్కగా ఉంచిన ద్విచక్ర వాహనాలను మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు టోయింగ్‌ చేస్తున్నారు. 

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన 15 ఏళ్ల అర్నవ్‌ దగా.. స్థానిక రచయితల భవనం, షాహిద్‌ మినార్, సాల్ట్‌లేక్‌ స్టేడియం, సెయింట్‌ పాల్‌ కేథడ్రల్‌లను పేకముక్కలతో ఎతైన నిర్మాణాలు చేపట్టి గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించాడు.

కరీంనగర్‌ కలెక్టర్‌ బంగ్లా సమీపంలో ఉన్న చెట్టు ఇది. దీని కొమ్మలకు ఒక్కో పుష్పగుచ్ఛానికి ఏడేసి ఆకులు ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఆల్స్టోనియా స్కాలరీస్‌ అని, దీన్ని డెవిల్‌ ట్రీ అని కూడా అంటారని పేర్కొన్నారు. ఈ చెట్టుకు ఏటా అక్టోబరులో సువాసన ఉండే పూలు విరివిగా పూస్తాయి.

పోతులపాడు గ్రామానికి చెందిన రైతు రఘునాథరెడ్డి తనకున్న 10 ఎకరాల పొలంలో ట్రాక్టర్‌ ట్యాంకర్‌కు రోజుకు రూ.వెయ్యి కిరాయి, అదనంగా ఒక ట్యాంకరు నీటికి రూ.150 ఇస్తూ తెప్పించుకుని పొలంలో మొక్క నాటే చోట లీటర్‌ చొప్పున పోసి నారు నాటిస్తున్నారు.

అటు బస్సులు.. ఇటు ఆటోలు, ఇతర వాహనాలు.. మధ్యలో రహదారిని దాటే జనం.. వెరసి హయత్‌నగర్‌ కూడలిని అధిగమించి వెళ్లాలంటే వాహనదారులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 

 దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని విల్లామేరీ కళాశాలలో శనివారం ముందస్తు వేడుకలు నిర్వహించారు. దాండియా నృత్యాలతో హోరెత్తించారు. వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించారు.

చిత్రం చెప్పే విశేషాలు (24-07-2024)

పాటే కాదు.. డ్యాన్సూ చేస్తా బ్రో..

హీరామండిలో నువ్వెందుకు చేయలేదు

Eenadu.net Home