చిత్రం చెప్పే విశేషాలు

(09-10-2023/2)

హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ గ్రాండ్‌ లాన్స్‌లో తెలంగాణ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన విభిన్న చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వాటిని చూడడానికి అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. 

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక బృందాలు రాకపోవడంతో..తమ ఆప్తుల కోసం తామే.. అందుబాటులోని పరికరాలతో తవ్వుతూ వారిని కాపాడుకుంటున్నారు. 

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఎమ్మడి సిల్వర్‌ జువెల్లరీ షోరూం ప్రారంభోత్సవంలో సినీనటి మెహరీన్‌ ఫిర్జాదా సందడి చేశారు. నూతన డిజైన్ల ఆభరణాలతో మోడల్స్‌ ఫొటోలకు పోజులిచ్చారు. 

గుజరాత్‌లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి యువతులు చేసిన గార్బా డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. 

మంత్రి కేటీఆర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల క్యాప్ ధరించారు.

వన్డే వరల్డ్‌ కప్‌-2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. క్రికెట్‌ను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ‘కీడా కోలా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్రహ్మానందం, రఘురామ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం తెలిపింది. 

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అమెరికాలోని పలు ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. 

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(04-12-2023/3)

చిత్రం చెప్పే విశేషాలు (04-12-2023/2)

Eenadu.net Home