చిత్రం చెప్పే విశేషాలు

(10-10-2023/2)

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ గ్రాడ్యుయేషన్ డేకి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామిని మంగళవారం సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు.

సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదల చేసింది. 

ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

హమాస్‌ మిలిటెంట్ల దాడి వేళ.. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని నివాసం, సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై ఇజ్రాయెల్‌ జెండా రంగులైన నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించారు.

వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. నెల్లూరులో తెదేపా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.

 తిరుమల శ్రీవారిని సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home