చిత్రం చెప్పే విశేషాలు
(11-10-2023/1)
ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఉప్పల్ స్టేడియంలో ముచ్చటగా మూడోది.. చివరిదైన క్రికెట్ మ్యాచ్ పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మంగళవారం జరిగింది. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతలతో వీక్షించారు. ఆద్యంతం సందడిగా గడిపారు.
వానరులు అంటేనే ఇల్లు పీకి పందిరేస్తాయి. అలాంటిది ఆట వస్తువులు దొరికితే ఆగుతాయా.. మాకు సరిలేరు ఎవరు అంటూ ఇలా ఎగిరి గంతేసి సందడి చేస్తాయి. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని మున్సిపల్ పార్కులో అటు ఇటు గెంతుతూ కనిపించాయి.
అంతర్జాతీయంగా బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నేటి పరిస్థితులకు దర్పణం పడుతూ తేలికైన శిక్షలు..ఆగని ఆకృత్యాలు’ నినాదంతో మంగళవారం రంగంపేట మండల కేంద్రంలో దేవిన సిస్టర్స్ సోహిత, ధన్యత సైకత శిల్పం రూపొందించారు. న్యాయ వ్యవస్థ ఆలోచించాలని వీరు విజ్ఞప్తి చేశారు.
సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కథానాయకుడిగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బబుల్‌గమ్’. మానస చౌదరి కథానాయిక. మంగళవారం ఈ చిత్ర టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
పేట పట్టణంలో ఎమ్మెల్యే ప్రారంభించేలోగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో యాద్గిర్ రోడ్డులో బస్‌షెల్టరుకు కట్టిన రిబ్బను అలాగే ఉండిపోయింది.
ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 12 రేవులకు అనుమతులు ఉన్నాయి. కానీ నిబంధనలు పాటించడం లేదని ఎన్జీటీ, సుప్రీంకోర్టు తవ్వకాలు ఆపాలని ఆదేశించింది. కృష్ణా జిల్లాలో ఒక్క రేవుకూ పర్యావరణ అనుమతి లేదు. కానీ తవ్వకాలు ఆగిన పాపాన పోలేదు.
హనుమకొండ నగరంలో ఆటోలు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేటు ముందే అడ్డుగా ఆటోలు పెడుతుండడంతో వచ్చి పోయే వారికి ఇబ్బందిగా మారుతోంది.
బేతంచెర్ల మండలం బలపాలపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు కానీ తాగునీరు అందించడం లేదు. పాఠశాలలో బోరు కానీ, ఇతర నీటి సౌకర్యం గానీ లేదు. విద్యార్థులకు భోజన సమయంలో తాగునీటి కోసం ఆశ్రమం వద్ద ఉన్న కుళాయి వద్దకు వెళ్లి సీసాలతో తెచ్చుకుంటున్నారు.
ఇంజరి పంచాయతీ సాలీబులు గ్రామానికి చెందిన గొల్లోరి ప్రిస్కిల్లా టైఫాయిడ్ జ్వరంతో కొద్దిరోజులుగా బాధపడుతోంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబసభ్యులు సాలీబులు నుంచి జక్కం వరకు సుమారు ఆరు కి.మీ. దూరం డోలీమోతతో రోడ్డు పాయింట్‌కు తీసుకువచ్చారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.